Bhadrachalam: భద్రాచలం (Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిఎ నవాబ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చర్ల గ్రామానికి చెందిన ట్రైబల్ ఇసుక రీచ్, గ్రావెల్ రీచ్ ల యజమాని కాపుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా నాగరాజును బెదిరింపులకు గురి గురి చేస్తున్నాడని చెప్పాడు. గతంలో రూ. 8.50 లక్షల డబ్బులు అక్రమంగా వసూలు చేసి, క్యూబిక్ మీటర్ కి రూ.పది చొప్పున 36 లక్షల క్యూబిక్ మీటర్లకు లెక్కేస్తే రూ. 3.60 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నాగరాజు వివరించాడు.
మళ్లీ నాగరాజు జోలికి వెళ్లవద్దని హెచ్చరికలు
ఇదే విషయమై పలుమార్లు భద్రాచలం ఎమ్మెల్యేకు వివరిస్తే పిఎ నవాబును వారించి మళ్లీ నాగరాజు జోలికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పిఏ నవాబ్ తన తీరు మార్చుకోకపోగా రాత్రి వేళల్లో ఇసుక రీచ్ ల వద్దకు వచ్చి ఈ రీచ్ లు మొత్తం నావేనని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. క్యూబిక్ మీటర్ కి పది రూపాయలు చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేకు వివరిస్తే.. పిఎ నవాబును చెప్పుతో కొడతానని బెదిరించిన ఆయన తీరులో మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు
రూ.10 లక్షలకు రూ.300000 ఇవ్వాలి
ఇసుక రీచ్ లలో రూ.10 లక్షల ఆదాయం వస్తే రూ. 3 లక్షలు నాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపాడు. రీచ్ల వద్దకు వెళ్లి రాజా తో ఈ రీచ్ నాదేనని చెప్పి మాలో మాకు గొడవలు సృష్టిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. నవాబ్ నాకోసం రాత్రిళ్ళు కాపలా వేసి కోయ కోడక అంటూ తిట్టాడని వెల్లడించారు. రీచ్ వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాపై దాడి చేశాడని తెలిపాడు.
భద్రాచలం నుంచి 11 మంది, చర్ల నుంచి 12 మంది
ఇసుక రీచ్ ల వద్ద రాత్రి వేళల్లో కాపలా ఉంటున్న నాపై దాడి చేసేందుకు భద్రాచలం నుంచి 11 మందిని, చర్ల ప్రాంతం నుంచి మరో 12 మందిని తీసుకొచ్చి దాడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాడు. నన్ను చంపుతానని బెదిరిస్తూ ట్రైబ్స్ అయిన నన్ను నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు. చర్ల నుంచి వచ్చిన వారిలో పరుచూరి రవి, ఆర్కే, పసి, గుడపాటి శ్రీను లను గుర్తించానని తెలిపాడు. ఈ ఘటనకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఎలాంటి పాపం తెలియదని నాగరాజు చెబుతున్నాడు. దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎవరు నన్ను ఆపడానికి ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: Khammam District: ఆ ఊరులో నయా దందా.. అక్రమ వసూళ్లతో నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి బ్రేక్
రూ.3.60 కోట్లు ఇవ్వమని అడిగినట్లు సాక్ష్యం చూపించాలి.. భద్రాచలం ఎమ్మెల్యే పి ఏ నవాబు
కాపుల నాగరాజు ను నేను రూ.3.60 కోట్లు అడిగినట్లు సాక్ష్యం చూపించాలి. నాకు రూ.8.50 లక్షలు ఇవ్వలేదు. డాక్యుమెంట్స్ కోసం ఇచ్చాడు. అవి ఖర్చయ్యాయి. అక్షరం ముక్క రాదు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడా కూడా నాగరాజును బెదిరించలేదు డబ్బులు ఇయ్యమని అడగలేదు. అనవసరంగా నన్ను బదనాం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలం ఫిర్యాదు చేసుకున్నాం. స్థానిక సంస్థలు ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే పిఏనని బదనం చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నాడు. నేను నాగరాజు గొడవ పడిన సమయంలో పరిచరి రవి, రామకృష్ణ (ఆర్కె), పసి, గుడపాటి శ్రీను లేరు. నాగరాజు ఆదివాసి మహిళలను మోసం చేసి రీచ్ లను మధ్యవర్తిగా ఉండి అన్ని మోసగిస్తున్నాడు. 75 లక్షలకు ఒక రిచ్, 25 లక్షల కు మరో రీచ్ ను అమ్ముకున్నాడు. సంతకం చేయడం కూడా చేతకాదు కానీ వివాదం సృష్టించడానికి ముందుంటాడు. నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే.
