rrb ( Image Source: Twitter)
Viral

RRB Recruitment: RRB జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2025

RRB Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇండియన్ రైల్వేస్‌లో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల కోసం మొత్తం 2570 ఖాళీల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువతకు గొప్ప అవకాశం. B.E/B.Tech లేదా డిప్లొమా కలిగిన అర్హ అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 31 అక్టోబర్ 2025 నుంచి మొదలయ్యి 30 నవంబర్ 2025 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ అన్ని RRB రీజియన్‌లలో (గువహటి, ముంబై, చెన్నై, సికింద్రాబాద్ మొదలైనవి) ఖాళీలను భర్తీ చేస్తుంది.

ఖాళీల వివరాలు

పోస్టు విభాగాలు: JE (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, IT మొదలైన బ్రాంచ్‌లు), DMS, CMA.

మొత్తం ఖాళీలు

2570 (కేటగిరీ-వైజ్, రీజియన్-వైజ్ వివరాలు డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి).

Also Read: Peddi leaked photos: ‘పెద్ది’ సినిమా నుంచి వైరల్ అవుతున్న అనధికార పిక్స్.. నిర్మాతలపై మండి పడుతున్న ఫ్యాన్స్

వయోపరిమితి 

కనీస వయసు: 18 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ట వయసు: 33 సంవత్సరాలు ఉండాలి.

అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో B.E/B.Tech డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. (బ్రాంచ్-వైజ్ డీటెయిల్స్ నోటిఫికేషన్‌లో ఉన్నాయి).

Also Read: Water Bottles: ఏంటి.. వాటర్ బాటిల్ మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? బయట పడ్డ నమ్మలేని నిజాలు

దరఖాస్తు రుసుము

– జనరల్/OBC/EWS: రూ. 500 (ఇందులో రూ. 400 ఎగ్జామ్ ఫీజ్, రూ. 100 ఆప్లికేషన్ ఫీజ్ – ఫెయిల్ అయితే రూ. 400 రీఫండ్).
– SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులు: రూ. 250 (ఫెయిల్ అయితే రూ. 250 రీఫండ్)
– ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు: ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు (ఎగ్జామ్ ఫీజ్ మాత్రమే).
– పేమెంట్ ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్, కార్డ్, UPI) ద్వారా.

ఎంపిక ప్రక్రియ

– CBT-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1): జనరల్ అవేర్‌నెస్, మ్యాథ్స్, సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (100 మార్కులు).
– CBT-2: టెక్నికల్ అబిలిటీస్ + జనరల్ అవేర్‌నెస్ (150 మార్కులు).
– డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్.
– ఫైనల్ మెరిట్ లిస్ట్.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 31-10-2025.
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ : 30-11-2025.
ఎగ్జామ్ తేదీలు: డిసెంబర్ 2025 లేదా జనవరి 2026

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?