KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్(BRS) పార్టీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతుంది. పార్టీ పూర్తినాయకత్వంను నియోజకవర్గంపై మోహరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ ను కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచారంను పార్టీ ముమ్మరం చేసింది. ఇంటింటికే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కార్డులను పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ను సైతం ఈసీ ప్రకటించడంతో పార్టీ సైతం దూకుడు పెంచింది. మాజీ మంత్రులు, డివిజన్ ఇన్ చార్జులు సైతం ప్రచారం ముమ్మరం చేశారు.
స్థానిక కార్పొరేటర్లతో..
జూబ్లీహిల్స్ లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల లోని ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని ఇప్పటికే నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దిశానిర్దేశం చేశారు. పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక కార్పొరేటర్లతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. అయితే ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నవారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే భారీ జనసమీకరణతో ప్రోగ్రాంలు నిర్వహిస్తే ప్రజల్లోనూ గెలుస్తారనే ప్రచారం జరుగుతుందని దీంతో విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఏ డివిజన్లలో ఏ రోజు ర్యాలీలు, రోడ్డు షోలు నిర్వహించాలనేదానిపై తేదీలపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు నేతలంతా నియోజకవర్గంలో ప్రచారం చేసేలా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నామినేషన్లు ఈ నెల 13 నుంచి ప్రారంభంఅవుతుండటంతో నామినేషన్ వేసే రోజూ సైతం భారీ ర్యాలీతో వెళ్లి వేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Illegal Constructions: ఓ ఎమ్మెల్యే అండతో సర్కారు భూమిలో నిర్మాణాలకు ప్లాన్!
ఎలా ముందుకు పోతారు..
మాగంటి గోపీనాథ్(Maganti Gopinadh) చేసిన అభివృద్ధి, ఆయనపై ప్రజల్లో ఉన్న సానుభూతి, గత బీఆర్ఎస్(BRS) చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. అయితే టికెట్ ఆశించిన నేతలు ప్రచారంలో పాల్గొనకపోవడం, ఆశించిన స్థాయిలో ఇంకొందరు నేతలు కలిసి రాకపోవడం బీఆర్ఎస్ కు కొంత గడ్డుపరిస్థితి నెలకొంది. అయితే వారిని ఎలా సమన్వయం చేస్తారు.. ప్రచారంలో ఎలా ముందుకు పోతారు..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొని సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో జూబ్లీహిల్స్ లో విజయం సాధించేందుకు చర్చలు నిర్వహిస్తున్నారు. మంగళవారం సైతం కేటీఆర్ అధ్యక్షతన హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్(Srinivass yadav), జగదీష్ రెడ్డి(Jagadesh Reddy) తదితర నేతలతో భేటీ అయ్యారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీపరంగా ప్రజలకు ఏ హామీలు ఇవ్వాలనేదానిపైనా కసరత్తు చేస్తున్నారు.
నేడు కార్పొరేటర్ లు, ఎమ్మెల్యేలతో వేర్వురుగా భేటి
గ్రేటర్ హైదరాబాద్ లో పట్టునిలుపుకునేందుకు బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్(Jubilee Hills) లో గెలిచేందుకు తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత గ్రేటర్ ఎమ్మెల్యేలతోనూ భేటీ నిర్వహించబోతున్నారు. ఇరువురికి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టుడటంతో మళ్లీ విజయం సాధించాలని, ప్రచారం ముమ్మరం చేయాలని, కులాల వారీగా నేతలతో భేటీ కావాలని సూచించబోతున్నట్లు సమాచారం.
Also Read: Bigg Boss: బ్రేకింగ్.. బిగ్ బాస్ ఆపేయండి.. సర్కార్ కీలక ఆదేశాలు.. షో ఆగిపోతుందా?
