Bigg Boss: కర్ణాటకలో పాపులర్ అయినా రియాలిటీ షో ‘బిగ్ బాస్ కన్నడ’ 12వ సీజన్‌కు ఊహించని షాక్ తగిలింది. సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్ హోస్ట్‌గా చేస్తున్న ఈ షో, బెంగళూరు శివార్లలోని బిడది హోబ్లీలో జరుగుతున్న నిర్మాణ స్థలానికి కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) నుంచి క్లోజర్ నోటీసు జారీ చేసింది.
టెస్ట్ లు చేయని మురుగునీటిని బహిరంగంగా విడుదల చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ ఉల్లంఘనలు వల్ల షో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. మరి ఈ డ్రామాటిక్ ట్విస్ట్ ఏమిటంటే?
Also Read: Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!
అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు
KSPCB అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు పడ్డాయి. వెల్స్ స్టూడియో అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ (జాలీ వుడ్ స్టూడియోస్) నిర్వహణలో ఉన్న ఈ సెట్‌లో 250 KLD (కిలోలీటర్లు ప్రతి రోజు) సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) ఏర్పాటు చేశారు. కానీ, దానికి సరైన డ్రైనేజీ కనెక్షన్లు లేకపోవడంతో, ఈ యూనిట్‌ను మూలన ఉంచి, సుమారు 2.5 లక్షలు లీటర్ల మురుగునీటిని చికిత్స చేయకుండా చుట్టుపక్కల బయటకు వదిలేశారు. ఇది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పల్యూషన్) యాక్ట్ 1974 సెక్షన్ 33(A), ఎయిర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పల్యూషన్) యాక్ట్ 1981 ప్రకారం తీవ్ర ఉల్లంఘనగా పరిగణించబడింది.
బిగ్ బాస్ సెట్‌లో లైట్స్, కెమెరాలు అన్నీ ఆగిపోయే పరిస్థితి?
చుట్టుపక్కల పర్యావరణ వ్యవస్థకు ఈ శుద్ధి చేయని నీటి విడుదల వల్ల తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే, వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో కూడా లోపాలు.. అసెగ్రిగేటెడ్ వేస్ట్, పూర్ డ్రైనేజీ, డీజిల్ జెనరేటర్ల ఉపయోగం వంటివి కనుగొన్నారు. ఈ సమస్యలు సరిచేసే వరకు, అన్ని కార్యకలాపాలను ఆపేయాలని, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (BESCOM)కు విద్యుత్ సరఫరా కట్ చేయాలని KSPCB ఆదేశించింది. ఈ చర్యలు వల్ల బిగ్ బాస్ సెట్‌లో లైట్స్, కెమెరాలు అన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
