Wife Suicide: క్షణికావేశాలు కాపురాలను నిలువునా కుల్చేస్తున్నాయి. చిన్న చిన్న వాటికే కొందరు మహిళలు నొచ్చుకుంటూ కాపురాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. భర్త తిట్టాడని, కొట్టాడని ఆరోపిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇటీవల తెలంగాణలోని జగిత్యాలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న 6 రోజులకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి తాజా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
అసలేం జరిగిందంటే?’
జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 6 రోజులకే నవ వధువు గంగోత్రి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 26న సంతోష్ – గంగోత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 2న దసరా రావడంతో ఇద్దరు కలిసి గంగోత్రి పుట్టింటికి వెళ్లారు.
మటన్‌లో కారం లేదనే..
అక్కడ కొత్త అల్లుడి కోసం గంగోత్రి కుటుంబ సభ్యులు వెరైటీ వంటకాలు చేశారు. పలు రకాల పిండివంటలు వడ్డించారు. ఈ క్రమంలో గంగోత్రి సైతం తన భర్తకు ప్రేమగా మటన్ కూర వండిపెట్టింది. అయితే మటన్ లో కారం తక్కువగా ఉండటంతో సంతోష్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. మాట మాట పెరిగడంతో ఇంటి సభ్యుల ముందే ఇద్దరు గొడవకు దిగారు. అయితే కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చజెప్పడంతో గొడవ సర్దుమనిగిందని అంతా భావించారు.
Also Read: Strange Incident: నా భార్య ఒక నాగిని.. రాత్రిళ్లు కాటు వేస్తోంది.. కలెక్టర్‌కు భర్త ఫిర్యాదు
తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
అయితే దసరా రోజు రాత్రికే సంతోష్, గంగోత్రి ఇద్దరు తమ ఇంటికి బయలు దేరారు. ఇంటికి వెళ్లాక కూడా మరోమారు మటన్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే భర్త తీరుతో తీవ్రంగా కుమిలిపోయిన గంగోత్రి.. ఆత్మహత్యకు పాల్పడింది. గంగోత్రి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గంగోత్రి మృతికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.
