Kerala Lottery: లాటరీలో 25 కోట్ల రూపాయల గెలుచుకున్నాడు?
luck ( Image Source: Twitter)
Viral News

Kerala Lottery: అదృష్ట దేవత అతడి తలుపు తట్టింది.. లాటరీలో కోట్ల రూపాయల గెలుచుకున్నాడు?

Kerala Lottery: అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. కేరళలోని ఆలప్పుళ జిల్లా తురవూరుకు చెందిన శరత్ ఎస్. నాయర్ అనే పెయింట్ షాప్ ఉద్యోగి జీవితం పూర్తిగా మారిపోయింది. కారణం? అతను ‘తిరువోణం బంపర్ లాటరీ 2025’లో ఏకంగా రూ.25 కోట్ల ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నాడు. దీంతో శరత్ ఒక్క రాత్రిలోనే స్టార్‌గా మారిపోయాడు.

కొచ్చిలోని నెట్టూరులో నిప్పాన్ పెయింట్స్ షాప్‌లో పనిచేసే శరత్, తన అదృష్ట టికెట్ (నంబర్: టీహెచ్ 577825)ని అదే నెట్టూరులో కొనుగోలు చేశాడు. సోమవారం నాడు తురవూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థైకట్టుస్సేరి బ్రాంచ్‌లో ఈ టికెట్‌ను సమర్పించి, తన విజయాన్ని అధికారికంగా నమోదు చేశాడు. రూ.25 కోట్ల బహుమతిలో 30% ఆదాయపు పన్ను (సుమారు రూ.7.5 కోట్లు), ఏజెంట్ కమిషన్ (సుమారు రూ.2.5 కోట్లు) తగ్గించాక, శరత్ చేతికి రూ.15.75 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం డబ్బు శరత్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి.. బీఆర్ఎస్ ఇన్‌చార్జి కీలక వ్యాఖ్యలు

శరత్ ఎస్. నాయర్ రియాక్షన్ ఇదే

” లాటరీ ఫలితాలు వచ్చినప్పుడు నేను ఆఫీసులో ఉన్నాను. మొదట నా అన్నకు ఫోన్ చేశాను. మేమిద్దరం కలిసి టికెట్ నంబర్‌ను జాగ్రత్తగా చెక్ చేశాం. అది నిజంగా మా టికెట్ అని నమ్మకం కలిగిన తర్వాతే బ్యాంక్‌లో టికెట్ ఇచ్చాము. విషయం బయటకు చెప్పకుండా ఉంచాలని నిర్ణయించాం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ డబ్బును ఎలా ఉపయోగించాలనే దానిపై ఇంకా ఆలోచన చేయలేదు,” అని శరత్ తెలిపాడు. ఆసక్తికరంగా, శరత్ ఈ ఓనం బంపర్ టికెట్‌ను మొదటిసారిగా కొన్నాడట. “ఇది నా మొదటి ఓనం బంపర్ టికెట్. ఇకపై కూడా లాటరీ టికెట్లు కొంటాను ” అని నవ్వుతూ చెప్పాడు. శరత్ తన తల్లిదండ్రులు, అన్న, భార్య, కుమారుడితో కలిసి తురవూరులో నివసిస్తున్నాడు. ఈ సంతోషకరమైన విషయం తన సన్నిహిత కుటుంబ సభ్యులు తప్ప ఎవరికీ తెలియదని, ఈ విజయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకున్నాడని శరత్ వెల్లడించాడు.

Also Read: Local Body Elections: స్థానిక అభ్యర్ధుల ఎంపికలో టీపీసీసీకి సవాల్.. రాహుల్ గాంధీ రూల్‌కు నై అంటున్న లీడర్లు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..