A Rare Honor For Ashwin, The Dignitaries In Attendance
స్పోర్ట్స్

Ravi Chandran Ashwin : అశ్విన్‌కు అరుదైన గౌరవం, హాజరైన ప్రముఖులు

A Rare Honor For Ashwin, The Dignitaries In Attendance : టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అశ్విన్ సత్తా చాటాడు. భారత్ తరఫున ఒకే సిరీస్‌లో రెండు ఫీట్లు సాధించిన టీమిండియా ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసిన అశ్విన్.. అదే సిరీస్‌లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో అశ్విన్ ను సత్కరించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అశ్విన్‌కు 500 బంగారు నాణేల జ్ఞాపికను సత్కరించారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించినందుకు 500 బంగారు నాణేలు అందజేయడం మరో విశేషం. దీంతో పాటుగా ప్రోత్సాహక బహుమతి కింద కోటి రూపాయల నగదును బహూకరించారు నిర్వాహకులు. ఈ ఘనతకు గుర్తుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ స్టాంప్‌ను కూడా రిలీజ్ చేశారు.

Read More: ఎలిమినేటర్ మ్యాచ్, నిజంగా మ్యాజిక్కే భయ్యా!

స్పిన్నర్లకు అనుభవం వస్తున్న కొద్ధీ పరిణతి చెందుతారని టీమిండియా మాజీ ఆటగాడు, కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. అశ్విన్ ఇంకా రెండు మూడేళ్లు బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే అవకాశం ఉందని తెలియజేశారు.ఇంకా రెండు మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే సత్తా అశ్విన్‌కి ఉందన్నారు. టెస్టు క్రికెట్‌లో ఐదు వందల వికెట్లు తీయడం చిన్న విషయం కాదని, అతడిలో టాలెంట్ ఇంకా దాగే ఉందని శాస్త్రి స్పష్టం చేశారు.

టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసిస్తూ.. రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్‌లో ఉన్న శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో అతడు ఉన్నత స్థాయికి వెళ్లాడని అన్నారు. ఒక తరం స్పిన్నర్లు అతడు స్ఫూర్తిగా నిలుస్తాడని, అశ్విన్‌తో కలిసి పని చేయడం ఎంతో అస్వాదిస్తానని స్పష్టం చేశారు. కెరీర్ స్టార్టింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ తనకు మద్దతుగా నిలిచాడని అశ్విన్ గుర్తు చేశాడు. ధోనీ తనకు ఇచ్చిన అవకాశానికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 17 ఏళ్ల క్రితం వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ గేల్ ఎదురుగా ఉంటే, తనకు బౌలింగ్ చేసే అవకాశాన్ని ధోనీ ఇచ్చాడని అశ్విన్ ప్రశంసించాడు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?