While Bangalore Royal Challengers Did The Magic Figure
స్పోర్ట్స్

BRC: ఎలిమినేటర్ మ్యాచ్, నిజంగా మ్యాజిక్కే భయ్యా!

While Bangalore Royal Challengers Did The Magic Figure : అందరి చూపు డబ్ల్యూపీఎల్ వైపే.. WPL మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ చివర్‌లో నిజంగా మ్యాజిక్ జరిగిందనే చెప్పాలి.

ఎందుకంటే.. చాలా ఈజీగా ఫినిష్ చేసుకునే గేమ్‌ని కాపాడుకుని మ్యాచ్ గెలవడం అంటే అంతా ఆశామాషీ కాదండీ బాబు. 136 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై విజయానికి ఒకానొక దశలో 24 బాల్స్‌లో కేవలం 32 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ ఈ మ్యాచ్‌ క్రీజ్‌లో ఉంది. ఈ టీమ్ చేతిలో ఇంకా ఏడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమీకరణాలతో టీ20 మ్యాచ్‌లో ఏ జట్టు పరాజయం పొందడం అంత ఈజీ కాదు. కానీ.. ఈ మ్యాచ్‌లో అదే సీన్ జరిగింది.

Read More: ఆర్‌సీబీ లోగో ఛేంజ్, అర్థమైందా రాజా..?

నిలకడగా,, ఆడుతూ.. విన్నర్‌ దిశగా సాగుతున్న తరుణంలో ముంబై ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు పారేసుకుంది. కెప్టెన్ హార్మన్ ప్రీత్, సజన వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో మ్యాచ్‌లో అసలు సిసలైన టర్నింగ్ పాయింట్ తిరిగింది. ఈ క్రమంలో ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ కాస్త ఆశని కలిగించింది ఆ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన.

అప్పటికే విజృంభించి ఆడుతున్న అమేలియా క్రీజ్‌లో ఉండటంతో.. ముంబై విజయంపై ధీమాగానే ఉంది. కానీ.. ముంబై బ్యాటర్లను వారి ఆశను క‌ట్టడి చేసింది. తొలి మూడు బంతుల‌కు 4 ప‌రుగులను మాత్రమే అందించింది. ఆ త‌ర్వాత నాలుగో బంతికి పూజ (04) ను పెవిలియ‌న్ పంపించింది. దీంతో వీరి టార్గెట్ 2 బంతుల్లో 8 ప‌రుగుల‌కు మారింది. ఆ త‌ర్వాతి రెండు బంతుల‌కు కేవలం 2 రన్స్‌ ఇచ్చి బెంగ‌ళూరును 5 ప‌రుగుల తేడాతో గెలిపించింది. ఇలా స్మృతి మంధాన సేన‌ లాస్ట్ వ‌ర‌కు పోరాడి అద్భుత విజ‌యాన్ని సాధించి ఫైన‌ల్‌కు చేరుకుంది. దీంతో రేపటి జరగబోయే ప్రీమియర్ లీగ్ టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఈ టీమ్ త‌ల‌ప‌డ‌నుంది.