Terrorists Who Fled To Pakistan If They Dont Surrender Their Properties Will Be Confiscated: గతవారం రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీపై టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ వారి దాడులను తిప్పికొట్టారు. అనంతరం ఆర్మీ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే సెర్చ్ ఆపరేషన్‌ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు జమ్మూకశ్మీర్‌ని అడుగడుగున జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే పట్టుబడిన కొంతమంది ఉగ్రవాదులను కోర్టులో హాజరుపర్చగా వారికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. అలాగే బారాముల్లాలోని ఎనిమిది మంది ఉగ్రవాదులను కోర్టు పరారీలో ఉన్నట్లు కూడా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకుంటూ అక్కడి నుంచి వారు తమ స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా బారాముల్లా, కుప్వారాతో సహా లోయలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని వారి రిపోర్ట్‌లో తేలింది.
అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. పోలీసుల అభ్యర్థన మేరకు పరారీలో ఉన్న ఎనిమిది మంది ముష్కరులు ఉరీ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ పక్కనే ఉన్న గ్రామాల్లో నివాసిస్తున్నట్లు సమాచారం అందినట్టు అధికారులు వెల్లడించారు. వీరంతా గత 28 ఏళ్లుగా పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది టెర్రరిస్టులు జమ్మూకశ్మీర్‌లో బానిసలుగా ఉన్నారు. భద్రతా బలగాల నుంచి ఒత్తిడి పెరిగినప్పుడు, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పాకిస్థాన్ దేశం వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు ఆశ్రమం పొందిన తర్వాత మళ్లీ భారత్‌కు వచ్చి ఇక్కడ దాడులు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పోలీసులు కోర్టుకు వివరించారు.
Also Read: మయాన్మార్ హత్యలను ఖండించిన యూఎన్ అధికార ప్రతినిధి
ఇక పరారీలో ఉన్న ఉగ్రవాదుల్లో ఉరీలోని కంది బర్జాలా నివాసితులు, జబ్లా ఉరీకి, బడా గోహలన్‌కు చెందిన వారు ఉన్నారని కోర్టులో పోలీసులు వెల్లడించారు. అయితే, వీరందరినీ పరారీలో ఉన్నవారిగా ప్రకటిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఉగ్రవాదులందరి ఇళ్లలో, గ్రామాల్లో అతికించామని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ప్రతి ఒక్కరూ లొంగిపోవడానికి నెల రోజులు గడువు ఇచ్చారు. లేకుంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఆర్మీ అధికారులు.