Adwait Kumar Singh: పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ పై పూర్తి అవగాహన కల్పించాలని మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ (Adwait Kumar Singh) మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మ గూడెం బాలికల ఆశ్రమ పాటశాలను, అంగన్వాడీ కేంద్రం , మండల ప్రాథమిక పాటశాలను, కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. సందర్బంగా కలెక్టర్ పాఠశాలల్లోని కిచెన్ షెడ్ ,డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లైబ్రరీ తరగతి గదులను పరిసరాలను పరిశీలించారు.
Also Read: Meghalaya Chilli Eater: మిరపకాయలే ఆహారం.. వాటితోనే స్నానం కూడా.. వీడు మనిషి కాదు బాబోయ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాట్యాంశాలను పూర్తిచేయాలి
విద్యార్థుల యొక్కవివరాలను, వారి యొక్క అభ్యసన సామర్త్యాలను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, విద్యార్థులతో ముచ్చటించి విషయావగహన పరీక్షించారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం, డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాట్యాంశాలను పూర్తిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనంతో పాటు, మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసేలా పాఠ్యాంశాలను భోదించాలని అన్నారు. క్రమం తప్పకుండా పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి యొక్క మానసిక, ఆరోగ్య స్థితిగతులను నిత్యం గమనిస్తూ ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్య సానిటేషన్ చేయాలన్నారు. తనిఖీలో కలెక్టర్ వెంట ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Cyber Crime: అత్యాశకు పోయారా? అంతే సంగతులు.. పంజా విసురుతున్న సైబర్ మోసగాళ్లు!
