India VS US Rates: భారత్‌, యూఎస్‌ మధ్య రేట్ల వ్యత్యాసం ఇదే!
USA-Vs-India
Viral News, లేటెస్ట్ న్యూస్

India VS US Rates: భారత్‌లో ఆహార పదార్థాల రేట్లను యూఎస్‌తో పోల్చిన అమెరికన్.. వీడియో వైరల్

India VS US Rates: అమెరికాలో జీవితం చాలా ఖరీదైనదనే భావన భారతీయుల్లో ఉంటుంది. ఇది అక్షరాలా నిజమేనని స్వయంగా అమెరికన్ పౌరురాలు ఒకరు వెల్లడించింది. క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికా పౌరురాలు ఇండియాలో నివసిస్తోంది. భారతీయ వంటకాలను తెగ ఇష్టపడే ఆమె, ఆహార పదార్థాల రేట్ల విషయంలో భారత్, అమెరికా మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో ప్రాక్టికల్‌గా (India VS US Rates) వివరించింది. బయట భోజనం చేస్తే, అమెరికాతో పోల్చితే ఇండియాలో చాలా తక్కువ ఖర్చు అవుతుందని ఆమె వెల్లడించింది. ఇరుదేశాల మధ్య జీవన వ్యయాల్లో ఉన్న తేడాను వివరిస్తూ ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా క్రిస్టెన్ ఫిషర్ ఒక వీడియో షేర్ చేశారు. భారత్‌‌లో కేవలం 10 డాలర్లు ఖర్చయ్యే ఆహార పదార్థాలు అమెరికాలో ఏకంగా 100 డాలర్లు ఖర్చు అవుతాయని అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘‘నేను భారతదేశంలో జీవించడాన్ని ఇష్టపడే కారణాల్లో ఒకటి ఏమిటంటే, తరచూ బయటకు వెళ్లి తినగలగడం. ఇది అమెరికాలో అసాధ్యమనే చెప్పాలి. మా ఆరుగురు కుటుంబ సభ్యులం కలిసి 3 స్టార్టర్స్, 3 మెయిన్ కోర్సులు, డెసర్ట్ ఆర్డర్ చేసినా, మొత్తం కలిపి ఖర్చు 10 డాలర్లలోపే అవుతుంది. ఇలాంటి భోజనం అమెరికాలో చేయాలంటే కనీసం 100 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. ధరల విషయంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. పైగా, అమెరికాలో టిప్పింగ్ కల్చర్ ఉంది. దీనివల్ల అదనంగా చెల్లించాల్సి వస్తోంది. భారతదేశంలో నివసించేందుకు నేను ఇష్టపడే అనేక కారణాల్లో ఇదొకటి’’ అంటూ వీడియోకి క్రిస్టెన్ ఫిషర్ క్యాప్షన్ ఇచ్చింది.

Read Also-BC Reservations: కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. క్రిస్టెన్ ఫిషర్ అభిప్రాయంపై తమ స్పందనలను తెలియజేశారు. క్రిస్టెన్ ఫిషర్ చూసి చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. చాలామంది ఆమె అభిప్రాయాలకు మద్దతుగా స్పందించారు. ఒక యూజర్ స్పందిస్తూ, ‘‘ఇక్కడ (అమెరికాలో) 100 డాలర్లు ఖర్చు చేసినా, రుచి, సర్వీస్ అంత గొప్పగా ఉండవు. కానీ, ఇండియాలో మాత్రం సాధారణ, లేదా, లగ్జరీ రెస్టారెంట్లలో మంచి రుచికరమైన భోజనం లభిస్తుంది. పోటీ ఎక్కువగా ఉండడమే దీనివెనుకున్న కారణం’’ అని రాసుకొచ్చారు.

మరో యూజర్ స్పందిస్తూ, ‘‘మీరు చెప్పింది 100 శాతం సత్యం!. రెస్టారెంట్లలో భోజనం చేయడం భారతదేశంలో చాలా తక్కువ వ్యయంతో కూడుకున్నది. పైగా టిప్పింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు!. మెనూలో ఉన్న ఆహార పదార్థాలు విభిన్నంగా ఉండి ఆకర్షిస్తుంటాయి. ఉత్తర భారతం, దక్షిణ భారతం, ఇండో-చైనీస్ ఇలా ఎన్నో రకాల ఆహారాల జాబితాతో ఉండే మెనూలో ప్రతిదానికి ప్రత్యేకమైన రుచి, కారం మోతాదు ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

మరో నెటిజన్ స్పందిస్తూ, ‘‘భారతదేశంలో ఆరుగురి భోజనం ఖర్చు కన్నా, అమెరికాలో ఇచ్చే టిప్ ఎక్కువగా ఉంటుంది. అందుకే, మేము కుటుంబ సమేతంగా బయటకు వెళ్లి తినడం తగ్గించుకున్నాం’’ అని పేర్కొన్నారు. అంతకుముందుగా ఫిషర్ పోస్ట్ చేసిన మరో వీడియోలో, భారతదేశంలో కనిపించే, అమెరికాలో లేని విషయాలను కూడా వివరించింది. ఉదాహరణకు, యూపీఐ పేమెంట్లు విస్తృతంగా వాడవచ్చని ప్రస్తావించింది. కిరాణా వస్తువులు, ఇతర అవసరాల కోసం 5 నుంచి 10 నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ చేసే యాప్స్ కూడా ఇండియాలో ఉన్నాయని చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

">

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి