Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పోటీ చేసేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతున్నారు. పినపాక నియోజకవర్గంలో స్థానిక సంస్థల సందడి పల్లెల్లో ఎక్కువైపోయింది. ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో నుంచి ఆశావాహులు పల్లెల్లో సందడి చేయనున్నారు. ఈసారి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు సదాభిప్రాయంతో నాయకులంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధులవుతున్నారు. పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పలువురు నాయకులు తమకు అనుకూలంగా వచ్చిన రిజర్వేషన్ ఉన్నచోట పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా మణుగూరు అశ్వాపురం బూర్గంపాడు మండలాల్లో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఈ మండలాల్లో పోటీ చేయడానికి చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పలు మండలాల్లో వర్గాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థుల పోటీ ఎలా ఉండబోతుందోనని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అత్యంత సమీప వ్యక్తులు జెడ్పిటిసిగా టికెట్ ఇవ్వాలని పలువురు ఆయన వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం పలువురు నాయకులు శాసనసభ్యులు వెంట తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సత్తా చాటాలనే కసితో హడావుడి చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
అధికార పార్టీ కాంగ్రెస్ లో నుండి ఎక్కువమంది ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంతో చూపుతుంటే మరోవైపు సత్తా చాటాలనే కసితో . బీఆర్ఎస్ నాయకులు హడావుడి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఈసారి ఎలాగైనా తమ పట్టును నిలుపుకోవడానికి శాయశక్తుల ప్రయత్నాలు సాగిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమ అభ్యర్థులను గెలిపిస్తాయని భీమాతో ఉన్నారు. ఎలాగైనా తమ అభ్యర్థులను ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిపించుకోవాలనే ఆలోచనతో గెలిచే అభ్యర్థుల కోసం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరా తీస్తున్నారు. ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి, ప్రజల మన్ననలు పొందిన వారి వైపు మొగ్గుచూపి అభ్యర్థులను ఖరారు చేసి వారిని గెలుపు గుర్రాలుగా తీర్చిదిద్దాలని కోణంలో రేగ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Also Read: Bade Nagajyothi: అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే పోరాటం చేస్తాం.. బడే నాగజ్యోతి కీలక వ్యాఖ్యలు
