Bade Nagajyothi: తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని 420 హామీలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి మీ ఇంటికి వచ్చే నాయకులను నిలదీసి అడగండని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బడే నాగజ్యోతి (Bade Nagajyothi) పార్టీ శ్రేణులకు, ప్రజలకు సూచించారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ములుగు మండల అధ్యక్షుడు సాని కొమ్ము రమేష్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం కోసం అనేక హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు.
Also Read: Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ చూసిన ఫ్యాన్స్ థియేటర్లో ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్..
కాంగ్రెస్ పార్టీ చేసిన నమ్మ కద్రోహం
ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్న నేటికీ అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి 420 హామీలపై కాంగ్రెస్ పార్టీ చేసిన నమ్మక ద్రోహం పై ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను అప్రబత్తం చేసి చైతన్య పరచాలని సూచించారు.
రైతులకు రెండు లక్షల రూపాయల చొప్పున బాకీ
22 నెలల్లో అక్క చెల్లెళ్లకు ఒక్కొక్కరికి 55000, వృద్ధులు వితంతులు బీడీ కార్మికులకు 44000, ఆడబిడ్డలకు తులం బంగారం, చిన్నారులు కళాశాలకు వెళ్లే స్కూటీలు, ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వివిధ కళాశాలల సంస్థలకు ఎనిమిది వేల కోట్లు బాకీ ఉన్నట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా కింద ఒక్కో రైతుకు 76000, రుణమాఫీ 80% కూడా పూర్తి చేయకుండా అనేకమంది రైతులకు రెండు లక్షల రూపాయల చొప్పున బాకీ ఉందన్నారు. రైతు కూలీలకు 24000, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 88000, విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షలు, ఉచిత బస్సుతో మోసపోయిన ఆటో అన్నలకు రెండేళ్లలో 24000 బాకీ ఉన్నట్లు వివరించారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇచ్చి వారికి ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి కేటాయిస్తామని మోసం చేశారన్నారు.
Also Read: Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్దికి సర్కారు ప్రాధాన్యత.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
