Warangal District: తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపులకు టెండర్ ప్రత్యేకంగా కొనసాగుతున్నది. అయితే ఉమ్మడి వరంగల్(Waranagal District) జిల్లాలో మధ్యం వ్యాపారం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొత్తం 294 మధ్యం షాపులు ఉండగా కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆ అంశం అక్కడి స్ధానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత నెల 26వ తేదీ నుంచి ఎక్సైజ్ శాఖ టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఓ పక్క దరఖాస్తుల చివరి తేదీ సమీపిస్తున్నది. అయినప్పటికి ఆసక్తి చూపే వ్యాపారులు చాలా తక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా చూస్తే వరంగల్(Warangal) జిల్లాలో 57 షాపుల ఉన్నాయి.
హన్మకొండ జిల్లాలో..
వీటికి కేవలం మూడు దరఖాస్తులు హన్మకొండ(Hanumakonda) జిల్లాలో 67 షాపులకు ఒక దరఖాస్తు మాత్రమే వచ్చాయి. జనగామ(Janagama) జిల్లాలో 50 షాపులకు రెండు దరఖాస్తులు మాత్రమే, మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో 61 షాపులకు కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ములుగు(Mulugu), భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఉన్న 59 మధ్య దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంపై అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో అధికారులు అంచనా కొత్త పాలసీలో లైసెన్స్ ఫీజులు భారీగా ఉండటం వల్ల వ్యాపార లాభాలు తగ్గుతాయనే భయం అని అనుకుంటున్నారేమొ అని అనుకుంటున్నారు.
Also Read: Harish Rao: పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో మద్యం వ్యాపారం పై ఉన్న కఠిన నియంత్రణలు వంటి అంశాల వల్ల వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మధ్యం టెండర్ల గడువు ముగిసేలోపు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందన్న ఆశతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా మద్యం షాపులకు ఇంత తక్కువ దరఖాస్తులు రావడం అధికారులను ఆశ్చర్యం కలిగిస్తుంది.
నూతన మధ్యం దుకాణాలు
డిసెంబర్ 1 నుండి తెలంగాణ(Telangana)లో నూతన మధ్యం దుకాణాలకు సంబదించి దరఖాస్తులను సెప్టెంబర్ 26 నుచి స్వకరిస్తున్నారు. ఇప్పటివరుకు మొత్తం శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 447 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైంజ్ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే రోజులలో ఇంకొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: Hydra: కొండాపూర్‌లో రూ. 3600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
