Jagtial District (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Jagtial District: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం.. భయంతో విద్యార్థులు పరుగులు

Jagtial District: నేడు అరచేతిలో టెక్నాలజీ, ఇంటర్నెట్‌తో యావత్ ప్రపంచాన్నే దగ్గర చేసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నప్పటికి, కొందరు వ్యక్తులు మూఢనమ్మకాల బారిన పడుతూ.. క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తోంది. నేడు జగిత్యాల(Jagityala) పట్టణంలోని ధరూర్ క్యాంపులో DSP కార్యాలయంకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన అక్కడి స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. పాఠశాల ప్రాంగంనంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. అదిచూసిన విద్యార్ధులు, ఉపాద్యాయులు దాన్ని చూసి భయంతో పరుగులు తీశారు.

Also Read: Gajwel News: మరింత విస్తరించనున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ.. ఎలాగో తెలుసా!

విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలు..

నిన్నటి వరకు దసరా సెలవులు(Holidays) ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ ముందు వరండాలో ముగ్గులు వేసి, పసుపు–కుంకుమ చల్లి, దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో భయాందోళన కలిగించింది. గతంలో ఓసారి ఇదే పాఠశాలలో పావురాన్ని చంపి స్కూల్ గంటకు వేలాడదీసిన ఘటన జరగడం మూఢవిశ్వాసాల పరంపర కొనసాగుతున్నట్టు చూపుతోంది. కంప్యూటర్ యుగంలోనూ విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలకు వేదిక కావడం వలన ఆందోళన కలిగిస్తుంది. పాఠశాలల్లో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడం విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని జిల్లా అధికారుల స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.

Also Read: Gajwel News: మరింత విస్తరించనున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ.. ఎలాగో తెలుసా!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!