Ponnam Prabhakar (imagecredit:twitter)
Politics, హైదరాబాద్

Ponnam Prabhakar: రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వండి: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: గ్రేటర్ లోని రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతివ్వాలని హైదరాబాద్(Hyderabad) ఇన్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnamprabakar) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnadh Singh) ను కోరారు. జీహెచ్ ఎంసీ(GHMC) మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar yadav), సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్(MLA Ganesh) సంతకాలతో కూడిన లేఖ ను రాజ్ నాథ్ సింగ్ కు అందజేశారు. హైదరాబాద్‌లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడిచిపెట్టడానికి సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని రక్షణ మంత్రిత్వ శాఖకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు.

రూ.1,000 కోట్లు పెండింగ్‌..

రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ బకాయిలను సకాలంలో క్లియరెన్స్ చేయడం వలన రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందన్నారు.

Also Read: New Liquor Shops: గద్వాల జిల్లాలో లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ సంతోష్

భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అయితే ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని మీకు అభ్యర్థిస్తున్నానన్నారు. నగర అభివృద్ధికి , ప్రజా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యత కలిగిన కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు , మొబిలిటీ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ భూమార్పిడి కీలకం అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగడం లేదని మీ దృష్టికి తీసుకువస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య పాలన, స్థానిక ప్రాతినిధ్యం దృష్ట్యా, ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన చేస్తుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Also Read: Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది