Unique Train Toilet: రైల్వే ప్రయాణికులను ప్రధానంగా వేధించే సమస్యల్లో బాత్రూమ్ ఒకటి. బోగీల్లో ఉండే పబ్లిక్ టాయిలెట్స్.. అపరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంటాయి. ఎక్కువ ప్రయాణికులు ఉపయోగిస్తుండటం కారణంగా బాత్రూమ్ లో అడుగుపెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఓ రైలులో బాత్రూమ్ అత్యాధునికంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది కూడా భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న రైలు కావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి బాత్రూమ్ నే మిగతా రైళ్లల్లోనూ ప్రవేశపెట్టాలన్న డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ముంబయి గుండా ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్ ప్రైస్ రైలు (Rajdhani Express Train) లోని సౌకర్యాలను ఓ వ్యక్తి కళ్లకు కట్టాడు. ముఖ్యంగా రైలులోని బాత్రూమ్ అత్యాధునిక సెన్సార్ సిస్టమ్ తో రూపొందించడాన్ని వీడియోలో అతడు చూపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వీడియోను గమనిస్తే ఓ వ్యక్తి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు బాత్రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ పరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్డిని చూపించాడు. బాత్రూమ్ లోని అద్దం, వాష్ బేసిన్ ఎంత శుభ్రంగా ఉన్నాయో కళ్లకు కట్టాడు.
సెన్సార్ బాత్రూమ్
సెన్సార్ తో కనెక్ట్ అయిన బాత్రూమ్ ను సైతం సదరు వ్యక్తి వీడియోలో చూపించాడు. అతడు తన చేయిని సెన్సార్ వద్ద పెట్టగానే.. టాయిలెట్ సీటుపై ఉన్న ప్లాస్టిక్ కవర్ ఆటోమేటిక్ గా మారిపోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇది తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ప్రతీ రైలులో ఇలాంటి బాత్రూమ్ వ్యవస్థనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. మెుత్తంగా ఈ వీడియోలో రైళ్లల్లో వస్తోన్న ఆధునిక సాంకేతికతను.. నానాటికి పెరుగుతున్న పరిశుభ్రతను అతడు హైలేట్ చేయడం గమనార్హం.
View this post on Instagram
Also Read: Jharkhand: పట్టించుకోని ప్రభుత్వం.. సొంత నిధులతో రోడ్డేసిన మహిళలు.. రియల్లీ గ్రేట్!
నెటిజన్ల రియాక్షన్..
రాజధాని ఎక్స్ ప్రెస్ ఉన్న సౌకర్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఈ వీడియోపై సానుకుల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ.. ‘హైజీన్ విషయంలో ఈ రైలు చాలా బాగుంది’ అని అన్నారు. మరికొందరు ఇలాంటి సదుపాయాలను అన్ని రైళ్లలో నిర్వహించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఒకరు వ్యంగ్యంగా స్పందిస్తూ ‘అన్నా.. అన్ని రైళ్లలో ఇలాంటి సెన్సార్ పెడితే ప్రజలు పగులగొట్టి తీసుకెళ్తారు’ అని రాశారు. మరో వ్యక్తి స్పందిస్తూ ‘సిగరెట్ తాగితే అలారం ఏమైనా మోగుతుందా?’ అని ఫన్నీగా ప్రశ్న వేశాడు.
