Ramchander Rao: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అత్యధిక స్థానాలు సాధిస్తామని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు(N. Ramchendar Rao)అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం కరీంనగర్(karimnagar) లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మొదలైందన్నారు. ముందు జడ్పీటీసీ(ZPTC) అభ్యర్థులను డిక్లేర్ చేయాలి. ఏకగ్రీవంగా ఉన్న చోట బి.ఫాం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్ఎస్. కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను దెబ్బతీశారు. నాడు సర్పంచులు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారు. తాజా మాజీ సర్పంచులు పడిన యాతన వర్ణణాతీతం అన్నారు. పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి తెచ్చారు.
ఎరువుల పేరుతో సబ్సిడీ..
కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసింది. రైతు భరోసా ఇయ్యడం లేదు. పీఎం కిసాన్ సమ్మాన్(PM KISAN SAMMAN) నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల అకౌంట్లో నిధులు జమ చేస్తోంది. ఉచితంగా బియ్యం అందిస్తోంది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. రోడ్లు, నర్సరీలు, ఇంటింటికీ నీళ్లు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో జరుగుతున్నవే. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోంది. బీజేపీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోంది. బీజేపీని ఆదరించాలని కోరుతున్నా. గ్రామాలకు రూ.40 వేల కోట్లు ఎరువుల పేరుతో సబ్సిడీ ఇస్తోంది. ఎరువుల పంపిణీ చేతగాక క్రుత్రిమ కొరతకు పూర్తి బాధ్యులు కాంగ్రెస్ దే. మొన్ననే లక్ష మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఖరీఫ్ సీజన్ లో పూర్తిస్తాయిలో ఎరువులను పంపిణీ చేస్తున్నాం. బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొస్తాం. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించండి. 42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండేళ్ల జాప్యం చేశారు. హైకోర్టు ఆదేశించినందునే తప్పనిసరై ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారు.
Also Read: Maruthi responds: వారికి ‘ది రాజాసాబ్’ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్.. ఫ్యాన్స్ నుంచి అది చాలు..
అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే..
బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతం. కోర్టుకు కాంగ్రెస్ నేతలే వెళ్లినట్లున్నారు. రాజ్యాంగ బాధ్యతను కాంగ్రెస్ తీసుకోవాలి. ఎన్నికలు జరిపి తీరాలని కోరుతున్నా. దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలుంటాయి. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. రాష్ట్రంలో బీసీఈ ముస్లింలకు సంబంధించినదే. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ కు మాత్రమే ఆనాడు పరిమితం చేశారు. కానీ ఈనాడు వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దీనికి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎన్నికలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తోందో వేచి చూడాలి. కోర్టు తీర్పును ముందుగా ప్రిడిక్ట్ చేయలేం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి పాల్పడింది. ఈ ప్రాజెక్టు మొత్తం విచారణ చేయాలి. కానీ మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం చేయడం సరికాదు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారం వాటిని రిపేర్ చేయాలి. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం. పార్టీని వీడేటప్పుడు రాజీనామా చేయాలన్నదే మా అభిమతం. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రిష్ణ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad Collector: గాంధీ జయంతి ఏర్పాట్లను స్పీడప్ చేయాలి.. కలెక్టర్ హరిచందన కీలక అదేశాలు