tilak-varma( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: క్రికెటర్ తిలక్ వర్మపై మెగాస్టార్ పోస్ట్ వైరల్.. ఏం అన్నారంటే?

Chiranjeevi: భారత్ క్రికెట్ టీమ్ 2025 ఏషియా కప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మా అద్భుతమైన ప్రదర్శన చేసి, భారత్‌ను 9వసారి ట్రోఫీ సాధించేలా చేశాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తిలక్ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో “పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయం! ఏషియా కప్ చాంపియన్స్ టీమ్ ఇండియాకు అభినందనలు. తిలక్ వర్మా, శివం దూబేలా అద్భుత ప్రదర్శన.. షబాష్!” అంటూ ప్రశంసించారు. ఈ పోస్ట్ వైరల్ అవుతూ, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. ఏషియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు అభినందనలు తెలిసారు. వీరిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు.

Read also-Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!

దుబాయ్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఒక థ్రిల్లర్. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 146/8 స్కోరు చేసింది. భారత్ ఛేజింగ్‌లో 20/3 అయ్యి కుప్పకూలినప్పటికీ, తిలక్ వర్మ అన్‌బీటెన్ 69 (53 బంతుల్లో) సాధించి, శివం దుబే (33), సంజు సామ్సన్ (24) సహాయంతో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించాడు. తిలక్ ప్రదర్శనకు మెంటార్ గౌతం గంభీర్ కూడా “కాల్మ్ అండర్ ప్రెషర్” అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ ఏషియా కప్‌లో 9వ టైటిల్ సాధించి, రికార్డు సృష్టించింది. ఏషియా కప్ టోర్నీలో అతను 200+ రన్స్ సాధించి, టాప్ స్కోరర్‌ లో ఒకడిగా నిలిచాడు. ఫైనల్‌లో అతని కామ్పోజర్, రిస్క్ తీసుకునే స్పిరిట్ భారత్ విజయానికి కీలకం. పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ కూడా “తిలక్ ప్రదర్శన అసాధారణం” అని అంగీకరించారు.

Read also-Rural Health Care: పండుగకు తాళం వేసిన పల్లె దవాఖానలు.. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమా దిగ్గజం, క్రికెట్ పట్ల ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తూ ప్రసిద్ధి. భారత విజయాలపై తన సోషల్ మీడియాలో తప్పక అభినందనలు తెలుపుతూ ఉంటారు. ఈసారి తిలక్ వర్మను ప్రత్యేకంగా ప్రశంసించడం ద్వారా, యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచారు. చిరంజీవి పోస్ట్‌కు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలు లైక్స్, కామెంట్స్‌తో స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి అభినందనలు ఈ ఘనతకు మరింత ప్రేరణ కానున్నాయి. ఈ పోస్ట్ పెట్టడంపై మెగా అభిమానులు టేలెంట్ ను గుర్తించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందు ఉంటారని కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

OTT Movie: ఒంటరితనానికి గురైన చిన్నారి.. ఆ రహస్యం కోసం ఏం చేశాడంటే?

OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా పట్టుబడితే.. ఏం చేశారంటే?

Bathukamma Record: బతుకమ్మకు రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు

OTT Movies: అక్కడ వర్జినిటీ కోల్పోవడానికి అంత కష్టపడాలా.. లేదంటే ఏం అవుతుందంటే?

Kavitha: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా.. కవిత సంచలన వ్యాఖ్యలు