Rural Health Care: అల్లాడిపోతున్న రోగులు?
rural ( Image Source: Twitter)
Telangana News

Rural Health Care: పండుగకు తాళం వేసిన పల్లె దవాఖానలు.. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా..?

Rural Health Care: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆరోగ్య సదుపాయాలు,పల్లె దవాఖానలే ఆరంభం అంటూ హామీలు ఇచ్చినా… వాస్తవానికి మాత్రం పరిస్థితి తలకిందులుగా ఉంది. పండుగ రోజు గ్రామాల ప్రజలకు అండగా ఉండాల్సిన పల్లె దవాఖానలు తాళం వేసి మూతబడ్డాయి.దాంతో చికిత్స కోసం వచ్చిన రోగులు దవాఖాన తలుపు తట్టి తిరిగి వెనుదిరగాల్సి వచ్చిన దుస్థితి నెలకొంది.గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి జ్వరం, గాయాలు, గర్భిణీ స్త్రీల చెకప్‌ల కోసం ఆధారపడే పల్లె దవాఖానలు మూతబడ్డాయి.

Also Read: Telangana Jagruthi: గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్.. ఈ సాకుతో జీవోను కోర్టు కొట్టివేసే ఆస్కారం!

పండుగ పేరుతో సిబ్బంది గల్లంతు కావడంతో దవాఖానల ముందు నిరాశగా నిలబడిన రోగులు ప్రాణాలతో ఆటలాడుతున్నారా…? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది ఎందుకని..? అత్యవసర సమయంలో కూడా తలుపులు మూసేస్తే గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళాలి..? అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవంగర మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే దృశ్యం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.తలుపులు వేసి ఖాళీగా ఉన్న పల్లె దవాఖానలు… బాధతో వెనుదిరిగిన రోగులు… ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లో ఆరోగ్యసేవలకు పండుగ పేరుతోనే గ్రహణం పట్టినట్టే అయింది.

Also Read: Ponguleti Srinivas Reddy: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని పేద‌ల‌కు గుడ్ న్యూస్.. అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం

Just In

01

Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన

Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్‌లో భద్రతా ప్రమాణాలేవీ?

Thalaivar 173: రజనీకాంత్ ‘తలైవార్ 173’ కి దర్శకుడు ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!