Telangana Jagruthi ( image credit: twitter)
తెలంగాణ

Telangana Jagruthi: గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్.. ఈ సాకుతో జీవోను కోర్టు కొట్టివేసే ఆస్కారం!

Telangana Jagruthi: 42శాతం రిజర్వేషన్లపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ధర్నాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, షెడ్యూల్ 9లో రిజర్వేషన్లను చేర్చి రాజ్యాంగ పరమైన రక్షణ చేపట్టాలని కోరారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ ఆచారి మాట్లాడుతూ రిజర్వేషన్లపై జీవో ఇచ్చి కంటి తుడుపు చర్య తీసుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా చేసిందని ఆరోపించారు.

 Also Read: Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ

ఇచ్చిన హామీలను నేరవేరుస్తామని ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలతో కూడా చెప్పించి గెలిచారని, అధికారంలోకి వచ్చాక చాలా రోజుల పాటు డెడికేటేడ్ కమిషన్ వేయకుండా కాలాపయాన చేశారన్నారు. సాధారణ కమిషన్ వేయటంతో కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. దీంతో డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేయించారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేసేలా కవిత ఆధ్వర్యంలో జాగృతి పోరాటం చేసిందన్నారు. ఈ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందని, కవిత మొత్తం మూడు బిల్లులు డిమాండ్ చేశారని, దానిలో రెండు బిల్లులను అడిగినట్లు చేశారన్నారు. మూడు బిల్లులు సపరేట్ అవుతేనే అవి అమలవుతాయని కవిత చెప్పారని, ఐతే ప్రభుత్వం తెచ్చిన చట్టం, ఆర్డినెన్స్ కంటి తుడుపు చర్యలుగానే కనిపిస్తున్నాయని ఆరోపించారు.

జీవో కోర్టు కొట్టివేసే ఆస్కారం

ఇప్పటికే సవరణ చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కూడా ఆమోదం పొందలేదన్నారు. అటు రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు, గవర్నర్ దగ్గర మరో బిల్లు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తెచ్చిన జీవో కోర్టు కొట్టివేసే ఆస్కారం ఉంటుందని, ఈ విషయాన్ని తెలంగాణ జాగృతి ముందునుంచే చెబుతూ వస్తోందని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. మంత్రి పొన్నం ఎవరు కోర్టుకు వెళ్లవద్దని కోరుతారని, ప్రభుత్వం చేయావల్సిన పని చేయకుండా కోర్టు వెళ్లవద్దని అడగటం ఏంటీ? ప్రభుత్వం ఏదైనా పనిచేస్తే పకడ్బందీగా ఉండాలి.. మీరే కదా మాకు హామీ ఇచ్చిందన్నారు. కోర్టుకు వెళ్లవద్దని కోరితే ఎవరూ వెళ్లకుండా ఉండటం సాధ్యమేనా? చట్టం వీగిపోకుండా చేయాల్సిన పనులన్నీ ప్రభుత్వమే కదా చేయాలని నిలదీశారు. సమావేశంలో నాయకులు రూప్ సింగ్, బీసీ జాగృతి అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, ఎంబీసీ జాగృతి అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Tourism Funds Scam: బీఆర్ఎస్ హయంలో టూరిజం నిధులు పక్కదారి.. ఎన్ని కోట్లు అంటే?

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగా అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మాల్టా దేశంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందన్నారు. ఆ పండుగను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళలతో కలిసి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అని పాటలు పాడి ఉత్తేజపరిచారు.

Just In

01

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ భారీ బడ్జెట్ సినిమా స్టార్ట్.. విలన్ ఎవరంటే?

Karur stampede FIR: విజయ్‌కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటన ఎఫ్ఐఆర్ లీక్.. వెలుగులోకి షాకింగ్ అంశాలు

Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్

Sasivadane trailer: ప్రేమిస్తే యుద్ధం తప్పదా!.. అది తెలియాలంటే ఈ ట్రైలర్ చూసేయండి..

World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!