Investment Scam: పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచే ముఠా గుట్టు వరంగల్ పోలీసులు రట్టు చేశారు. తెప్పాలి సైదులు, మనుబోతుల రామకృష్ణ, పొడిల సురేష్ కుమార్, పొడిల శ్రీధర్ అనే నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5లక్షల92వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్ తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోని ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా పేరుతో ఒక సంస్థను 2023 సంవత్సరంలో ఏర్పాటు చేసాడు. అనంతరం ప్రధాన నిందితుడు 2024 సంవత్సరంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చీటీ వ్యాపారాన్ని ప్రారంభించాడు.
గ్రామాల్లో ఏజెంట్లు ఏర్పాటు..
ఈ చిట్టీలో చేరే వారు ముందుగా ఆరు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులు చెల్లించిన డబ్బులో నాలుగు వేలు తన వద్దనే డిపాజిత్ చేసుకొని మిగితా రెండు రెండు వేల రూపాయలకు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం నమ్మకం కలిగేందుకు సభ్యులకు రెండు వేల రూపాయల విలువ వస్తువులను అందజేస్తాడు వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం మూడు వందలు మాత్రమే వుంటాయి. ఈ సంస్థ లో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చు. ఇందులో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బును తిరిగి అందజేసేవాడు. ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28, 493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో పాటు వీరి నుండి 4వేల రూపాయల చొప్పున మొత్తం రూ. 11 కోట్ల39 లక్షల రూపాయలు ప్రజల డబ్బు ను తన వద్దనే భద్రపరుచుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే కాకుండా నిందితుడు సభ్యులకు కేవలం మూడు వందల రూపాయల విలువ వస్తువులను అందజేయడం ద్వారా మరో రూ.4కోట్ల 84 లక్షల రూపాయలను మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తు లో నిర్ధారణ అయింది. ముఖ్యంగా ప్రజలు అత్యాశతో ఈ సంస్థలో లక్షల్లో పెట్టుబడి కూడా జరిగింది.
Also Read: OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!
ఎలాంటి లావా దేవీలు జరగకుండా..
ఈ సంస్థపై పోలీసులకు పలు పిర్యాదులు రావడంతో పాటు ఈ ముఠా సభ్యులు ప్రజల సొమ్ము తో తప్పించు పారిపోయే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి విచారించగా ఈ ముఠా పాల్పడే మోసం పోలీసులకు వెల్లడించడంతో పాటు ఈ ముఠా వసూల్ చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లుగా గుర్తించిన పోలీస్ అధికారులు, 5కోట్ల 48 లక్షల, 64 వేల రూపాయలకు సంబంధించి ఎలాంటి లావా దేవీలు జరగకుండా బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడం జరిగిందని. ప్రధాన నిందితుడు పై గతంలో మెదక్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇల్లందు, ఎల్. బి నగర్ పోలీస్ స్టేషన్ల లో సుమారు పదికి పై గా చీటింగ్ కేసులు ఉన్నట్లు వరంగల్ సీపీ వెల్లడించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు అధిక మొత్తం లో లాభం వస్తున్నది అని బోగస్ కంపెనీ లను నమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేస్తారు అప్పుడు మొత్తం నష్టపోతారు. ఇటువంటి మోసాగాళ్ల మాటలు నమ్మకుండా డబ్బులు పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలి తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తున్నదని చెబితే ఎవరు నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు. ఈ ముఠా పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్న పేట, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నర్సయ్య, మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్ పవన్, పాలకుర్తి సిఐ జానకీరాం రెడ్డి, పాలకుర్తి ఎస్. ఐ, టాస్క్ ఫోర్స్ ఎస్. ఐ వంశీ కృష్ణ, దిలీప్,తో టాస్క్ ఫోర్స్ మరియు పాలకుర్తి పోలీస్ సిబ్బందిని పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.
Also Read: New Liquor Shops: గద్వాల జిల్లాలో లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ సంతోష్