School Principal (Image Source: twitter)
Viral

School Principal: బ్యాంక్ చెక్‌లో అక్షర దోషాలు.. అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

School Principal: సాధారణంగా టీచర్లు అంటే ఉన్నత విద్యావంతులు అన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే స్థాయిలో వారు ఉంటారు కాబట్టి.. సర్వం వారికి తెలిసి ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అప్లికేషన్ ఫామ్స్ నింపడం, నగదు డిపాజిట్ ఫామ్ రాయడం, చెక్కులు ఫిల్ చేయడం వంటివి వారు ఎంతో సులువుగా చేయగలుగుతారు. అలాంటిది ఓ స్కూల్ ప్రిన్సిపల్ అయ్యుండి ఓ వ్యక్తి చెక్ రాయడంలో తడబడ్డాడు. నగదును అక్షరాల్లో రాయండంలో విఫలమై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి జారీ చేయబడ్డ ఓ చెక్.. స్పెల్లింగ్ మిస్టేక్స్ కారణంగా తిరస్కరణకు గురైంది. స్కూల్ స్వయంగా దాన్ని రాసినప్పటికీ తప్పుద్రోల్లడంతో బ్యాంక్ అధికారులు నగదు విత్ డ్రాకు తిరస్కరించారు. ప్రస్తుతం ఆ చెక్ కు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చెక్‌లో ఉన్న తప్పులు ఇవే

హిమాచల్ లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్.. సంతకంతో ఈ చెక్ ను రిలీజ్ చేశారు. అట్టర్ సింగ్ అనే వ్యక్తి పేరు మీద నగదు విత్ డ్రా చేసుకునేందుకు జారీ చేశారు. చెక్ లో రూ.7,616 నగదును ఇంగ్లీషు అక్షరాల్లో రాసి ఉంది. ‘Saven Thursday harendra sixty’ అని ఘోరమైన తప్పులు ఉండటంతో ఒక్కసారిగా బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. నగదు ఇచ్చేది లేదని చెప్పి.. వెనక్కి పంపేశారు.

నెటిజన్ల రియాక్షన్

చెక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అనేక మంది తీవ్రంగా స్పందించారు. ఒక యూజర్ స్పందిస్తూ.. ‘ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల నాణ్యతా ప్రామాణాలు ఈ విధంగా ఉన్నాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరు సెటైరికల్ గా ‘ఆటోకరెక్ట్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. అందుకే తప్పులు దొర్లాయి’ అని రాశారు. ఇంకొకరు వ్యాఖ్యానిస్తూ.. ‘రిజర్వేషన్ హటావో.. దేశ్ బచావో’ అని రాసుకొచ్చారు.

Also Read: US shutdown: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. విమాన, రైలు సర్వీసులు నిలిచిపోతాయా?

హెడ్ మాస్టరే రాశారా?

వైరల్ అవుతున్న చెక్ ను హెడ్ మాస్టర్ రాయలేదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఎవరో చెక్ ను ఫిలప్ చేస్తే దానిపై ఆయన సంతకం చేశారని అంటున్నారు. అయితే దీనిని కూడా పలువురు తప్పుబడుతున్నారు. ఎంత పడితే అంత అమౌంట్ రాస్తే ఇలాగే చూడకుండా సంతకం చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. కనీసం చెక్ ను పరిశీలించకుండానే అంత నిర్లక్ష్యంగా సంతకం పెట్టేస్తారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: High Speed Rail: సరికొత్త హై స్పీడ్ రైల్ వచ్చేస్తోంది.. గంటకు 200 కి.మీ వేగంతో రయ్ రయ్

Just In

01

Investment Scam: అధిక లాభాల ఆశ చూపి కోట్లు దోచేస్తున్న ముఠా అరెస్ట్ .. ఎక్కడంటే?

MLC Kavitha: ఈటల రాజేందర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు!.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి

Mutton Soup Teaser: ‘మటన్ సూప్’ టీజర్‌పై అనిల్ రావిపూడి స్పందనిదే..

GHMC: మూసారాంబాగ్ బ్రిడ్జి మార్చి కల్లా పూర్తి.. మరో రెండు బ్రిడ్జిల జీహెచ్ఎంసీ డెడ్ లైన్