Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా?
Viral Video (Image Source: twitter)
Viral News

Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఇది చూస్తే ఎప్పటికీ ఆ ధైర్యం చేయరు!

Viral Video: రైల్వే స్టేషన్ లో ట్యాప్స్ ద్వారా వచ్చే తాగు నీరు సురక్షితమైనదా? కాదా? అన్న ప్రశ్న ప్రయాణికులను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. అయితే వారి ఆందోళనలను నిజం చేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ వాటర్ ట్యాంకుల్లో కోతులు స్నానం చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వీడియో ఏముందంటే?

ఓ రైల్వే స్టేషన్ లోని వాటర్ ట్యాంక్స్ లో కోతులు జలకాలు ఆడుతున్న వీడియో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. స్టేషన్ భవనం పైకప్పు మీద ఉన్న ట్యాంకులు ఓపెన్ గా ఉండటం వీడియోలో గమనించవచ్చు. దీంతో అక్కడికి చేరిన కొన్ని కోతులు.. ట్యాంకులోకి దిగి ఆ నీటిలో స్నానం చేశాయి. ఎంతో సరదాగా నీటిలో ఆడుకుంటూ కనిపించాయి. చూడటానికి వీడియో ఎంతో సరదాగా ఉన్నప్పటికీ.. ఆ నీరు తాగే ప్రయాణికుల ఆరోగ్యం పరిస్థితి ఏంటన్న ప్రశ్న మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.

సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు

వీడియోలో ఓ కోతి నీటి ట్యాంకులో స్నానం చేస్తుండగా.. మరో రెండు కోతులు ట్యాంక్ మీద కూర్చొని కనిపించాయి. అయితే ఈ ఘటన ఏ రైల్వే స్టేషన్ లో జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. మెుత్తం మీద ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రయాణికులు వినియోగించే నీటి ట్యాంకులను అసలు ఎలా ఓపెన్ గా పెట్టారని నిలదీస్తున్నారు.

కోతుల వల్ల నీరు కలుషితం

‘రైల్వే స్టేషన్‌లోని నీటి ట్యాంకుల్లో కోతులు సరదాగా స్నానం చేస్తున్నాయి. ఇది ప్రైవేట్ బిల్డింగ్‌లో జరిగే అవకాశం ఉందా? ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎంత ఎక్కువో ఊహించండి. ఏ ప్రభుత్వ శాఖ పనిచేయదు. జీతాలు, లంచాలు, పెన్షన్లు మాత్రమే వసూలు చేస్తారు’ అనే శీర్షికతో ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు.

నెటిజన్లు ఫైర్

ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ ‘అసలు సమస్య.. బాధ్యతారాహిత్యమే. ఏదైనా ప్రమాదం జరిగే వరకు ఎవరూ బాధ్యత తీసుకోరు’ అని రాశారు. ఇంకొకరు స్పందిస్తూ ‘ఇలాంటి నీటిని ప్రయాణికులకు అందిస్తూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, భూమిని రక్షించాలి అని అంటారు. ఈ నీటితో మంకీ ఫ్లూ రావచ్చు. కాబట్టి స్టేషన్లలో నీళ్లు తాగకండి. కానీ పన్నులు మాత్రం సమయానికి చెల్లించండి. లేకపోతే ఫైన్ పడుతుంది’ అని వ్యంగ్యంగా రాశారు. మరికొరు వ్యాఖ్యానిస్తూ.. ‘రైల్వేలు కోట్ల ఆదాయం సంపాదిస్తాయి, కానీ తమ స్టేషన్లలో సురక్షితమైన తాగునీటిని మాత్రం అందించలేవు. రియల్‌టైమ్ మానిటరింగ్ లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు.

Also Read: Lions In Beach: ఆడ సింహాల ఒత్తిడి.. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తోన్న మగ సింహాలు.. ఇదేందయ్యా ఇది!

కోతుల వల్ల రైళ్లకు అంతరాయం

మరోవైపు రైళ్లు సమయానికి రావని భారతీయ రైల్వేపై ఒక అపవాదు ఉంది. కొన్ని సందర్భాల్లో కోతుల కారణంగా కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉదాహరణకు కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్ ఒక కోతి హై-వోల్టేజ్ వైర్లను తాకడంతో గంటసేపు ఆగిపోయింది. ఇంజినీర్లు వెంటనే మరమ్మతులు చేయడంతో ఆలస్యంగా రైలు మెుదలైంది.

Also Read: Hyderabad Police: సిమెంట్ బస్తాల ముసుగులో.. రూ.6.25 కోట్ల గంజాయి రవాణా ఎక్కడ పట్టుకున్నారంటే?

Just In

01

Sleeping Pods: రైల్వే గుడ్ న్యూస్.. రైలు వచ్చే వరకు ఎంచక్క అక్కడ పడుకోవచ్చు!

YouTuber Controversy: అన్వేష్ దెబ్బకు వీడియో డిలేట్ చేసిన ‘ఏయ్ జూడ్’.. రీ అప్లోడ్ వీడియోలో వేరే లెవెల్ వార్నింగ్..

US Strikes Venezuela: పెనుసంచలనం.. వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్.. రాజధానిపై భీకర దాడులు

Ticket Bookings Offer: సంక్రాంతి వేళ ధమాకా ఆఫర్.. రైళ్లల్లో ప్రయాణిస్తే డబ్బు వాపస్.. భలే ఛాన్సులే!

Municipal Elections: మున్సిపోల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!