CM Revanth Reddy: అక్టోబరు 5వ తేదీ నాటికి జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth Reddy) పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూమ్(Bhatti Vikramarka) మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని సీఎం సూచించారు.అక్టోబర్ 5వ తేదీనాటికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ప్రతి మండలం నుంచి ముగ్గురి జాబితా అందజేయాలని సీఎం మంత్రులకు సూచించారు.అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రూ.150 కోట్లు
స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎన్నికలకు రూ.450 కోట్లకు పంచాయతీరాజ్ శాఖ ప్రపొజల్స్ పంపించింది. ప్రభుత్వం మాత్రం రూ.325 కోట్లు మంజూరుచేసింది. సర్పంచ్ ఎన్నిక కోసం రూ.175 కోట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ కోసం రూ.150 కోట్లు వినియోగించాలని సూచించింది. బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సంబంధించిన మెటీరియల్, ఎన్నికల సిబ్బంది శిక్షణ కోసం నిధులు కేటాయించనున్నారు. జిల్లాలకు పోలింగ్ కేంద్రాల వారీగా ఈ నిధులు అందజేస్తారు. ఎంసీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సంబంధించి జడ్పీ సీఈఓలకు, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిధులను డీపీఓల అకౌంట్లో జమ చేయనున్నారు.
Also Read: Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..
సీఎంతో భేటి అయిన క్రికెటర్ తిలక్ వర్మ
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్రికెటర్ గా మారారు. ఇంట్లోనే బ్యాట్ పట్టి కాసేపు ప్రాక్టీస్ చేశారు. కొద్దిసేపు ఉత్తేజపరిచారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా యువ క్రికెటర్ తిలక్ వర్మ కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సీఎం అభినందించి సత్కరించారు. సీఎం కు క్రికెట్ బ్యాట్ ను తిలక్ వర్మ బహూకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులున్నారు.
Also Read: Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం
సీఎంను కలిసిన మంత్రిజూపల్లి.. బతుకమ్మ గిన్నీస్ వరల్డ్ రికార్డులు అందజేత
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(,(CM Revanth Reddy)) ని మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు రికార్డులను సీఎంకు అందజేశారు. సీఎంను సన్మానించారు. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ రికార్డు సృష్టించిన మన తెలంగాణ బతుకమ్మ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం ఎండీ క్రాంతి ఉన్నారు.
Also Read:OTT Movie: అమ్మాయిల బాడీ పార్ట్స్ తో అలాంటి ఆటలు.. ఓ మై గాడ్.. ఇది మామూలు థ్రిల్లర్ కాదు బాబోయ్!