PCC Mahesh Kumar Goud: ఆదిత్య కన్స్రక్షన్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumra Goud) వెల్లడించారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా అనే విభాగాన్ని తీసుకురావడం సంతోషకరమన్నారు. గతంలో ఈ సంస్థను తీసుకురావాల్సిన అవసరం పై అనేక సార్లు డిస్కషన్ చేసి, నిర్ణయం తీసుకున్నామన్నారు. హైడ్రాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నార హైడ్రా దూర దృష్టి సూపర్ అన్నారు. అక్రమ కట్టడాలను వెలికితీసి మరింత సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేకుంటే మూసీ నదీ ఉగ్రరూపానికి నష్టం వాటిల్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్‌కే సాధ్యమని బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందన్నారు. బీసీ రిజర్వేషనులు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని గుర్తు చేశారు. బీజేపీ(BJP) తో బీఆర్ఎస్(BRS) ఒకటేనని, కలిసే సంసారం చేస్తున్నట్లు అనేక విషయాల్లో స్పష్టమైందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటై కుట్ర పూరితంగా కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నాయన్నారు.
నిరుద్యోగుల కలలు సాకారం..
తెలంగాణకు బీఆర్ ఎస్ చేసిన అప్పులకు తాము వడ్దీలు కడుతున్నట్లు వెల్లడించారు. బకాయిల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆరే అంటూ వివరించారు. బీఆర్‌ఎస్ ‘బకాయి కార్డు’ ప్రచారంపై దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ ఎస్ కు ‘బకాయి’ అనే పదం కూడా ఎత్తే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్ట? అని ప్రశ్నించారు. ఆర్ధిక సమస్యలున్నా.. తాము ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతున్నామన్నారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) పాలనలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి
కనిపించడం లేదా?
రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచడం, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వరికి బోనస్ వంటివన్నీ ఇస్తున్నా.. బీఆర్ ఎస్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కూడా మొదలైందన్నారు. కాళేశ్వరం, ఫార్ములా కార్ రేస్, పలు ప్రభుత్వ పథకాల్లో స్కాంలు చేసిన బీఆర్‌ఎస్ బండారం ఒక్కొక్కటి బయట పడుతుండడంతో దిక్కుతోచక ‘బకాయి కార్డు’ పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ నవాబు తరహాలో పాలన చేశారన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా..
ఇక ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని, స్థానిక సంస్థలో ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు గెలుచుకుంటామన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందన్నారు.బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని అడిగే దమ్ము ఈటల, బండి సంజయ్,అరవింద్ కి లేదా? అని ప్రశ్నించారు. బీసీల నోటి కాడా ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే నిర్వహించామన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రుల బృందం కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించామన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు పాజిటివ్ తీర్పును ఇస్తుందనే నమ్మకం ఉన్నదన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కోరారు.
Also Read: The Raja Saab Trailer: ప్రభాస్ భయపెట్టడానికి వచ్చేశాడు రోయ్.. చూసేద్ధాం రండీ..