The Raja Saab Trailer: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన యాక్షన్ త్రిల్లర్ ‘ది రాజాసాబ్’. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు గ్రాండ్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ట్రైలర్ 3 నిమిషాల 34 సెకన్ల డ్యూరేషన్‌తో U/A సర్టిఫికేట్ పొందింది. ఇది హారర్, కామెడీ, యాక్షన్ మిక్స్‌గా ఉంది. ఈ ట్రైలర్ తో సినిమా – “ఫుల్ ప్యాక్.. అందించిందంటూ ఫ్యాన్స్ తెగ సంబర్ పడుతున్నారు.
Read also-OG collections: ‘ఓజీ’ నాలుగో రోజు గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆ రికార్డులు బ్రేక్..
తెలుగు సినిమా పరిశ్రమలో రచయిత, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా.. సంజయ్ దత్త్, నిధి అగర్వాల్, మాలవికా మోహన్ వంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్-కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్ లో రాబోతున్న ఈ సనిమాపై అభిమానుల భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత ప్రజాదరణ పొందేలా 3డీ వెర్షన్ లో కూడా రాబోతుంది. ఈ సినిమాను 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా తీసుకురానున్నారు నిర్మాతలు.
Read also-Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి
కార్తీక్ పళని సినిమాటోగ్రఫర్ గా ఈ సినిమాలో తన పనితనం చూపించారు. ఆయన ‘ఆదిపురిష్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన విజువల్స్ అందించారు. తెలుగు సినిమాల్లో లెజెండరీ ఎడిటర్‌గా పేరుగాంచిన కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు ఎడిటింగ్ పనులు చూసుకుంటున్నారు. ‘ఓజీ’ విజయంతో ఊపుమీద ఉన్న థమన్ సంగీతం అందించారు. థమన్ మామోలు సినిమాలకు సంగీతం అందిస్తేనే బాక్సులు బద్దలవుతుంటాయి. అలాంటిది ‘ప్రభాస్’ సినిమాకు ఏ విధంగా అందించారో చెప్పనక్కర్లేదు. ‘ది రాజాసాబ్’లో హారర్-కామెడీకి సరిపడా ట్రాక్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.
ట్రైలర ను చూస్తుంటే.. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ బాగా కుదిరినట్లు ఉన్నాయి. సైకలాజికల్ హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంది. ఇందులో హీరో ఏదోటి చేసి బాగా హైప్ సాధించాలని చూసే సామాన్యమైన పాత్రలో కనిపిస్తారు. అదే క్రమంలో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఉండనున్నాడు. ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. రెండో క్యారక్టర్ విలన్ గా కనిసిస్తున్నాడు. ఈ రెండు పాత్రల్లోనూ ప్రభాస్ సమర్థవంతంగా కనిపించారు. హర్రర్ జోనర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్స్ అందరినీ అలరించాయి. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. థమన్ సంగీతం అందరినీ భయపెట్టేలా ఉంది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్ కి ఫుల్ మీల్ లా అనిపిస్తుంది.