Viral-Crime
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: కోచింగ్ సెంటర్‌లో ప్రేమాయణం.. టీచర్‌ను పెళ్లి చేసుకున్న విద్యార్థిని.. ఆ తర్వాత..

Viral News: ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఓ కోచింగ్ సెంటర్‌లో చేరింది. కానీ, లక్ష్యం దారితప్పి, కోచింగ్ సెంటర్‌లో బోధన చేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఇంకేమంది ఇద్దరి మధ్య చనువు పెరిగి, ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. అయితే, విద్యార్థి వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. సదరు వ్యక్తితో వివాహానికి ససేమిరా అన్నారు. దీంతో, విద్యార్థిని, టీచర్ ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి ఓ దేవాలయంలో పెళ్లి (Viral News) చేసుకున్నారు. అయితే, తమకు ఎలాంటి హానితలపెట్టకుండా రక్షణ ఇవ్వాలంటూ ఇద్దరూ కలిసి ఒక వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటన బీహార్‌లో జరిగింది. జముయ్ జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్‌లో సింధు కుమారి అనే ఇంటర్ (క్లాస్ 12) విద్యార్థిని కోచింగ్ తీసుకుంది. అదే కోచింగ్ సెంటర్‌లో ప్రభాకర్ మాహతో అనే వ్యక్తి ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. మాహతో ప్రస్తుతం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే పోలీసు డ్యూటీలో చేరాడు. కాగా, వీరిద్దరి పెళ్లికి సింధు కుమారి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా, మాహతో కుటుంబం కూడా వ్యతిరేకించారు. ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో గత వారమే ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

Read Also- Asia Cup Trophy: ఇండియాకి ఆసియా కప్ ట్రోఫీ ఇచ్చేస్తా.. కానీ ఒకటే కండీషన్… మోహ్సిన్ నక్వీ సందేశం

ఇరు కుటుంబ సభ్యులు తమను ప్రశాంతంగా బతకనివ్వాలని నూతన దంపతులు ఇద్దరూ వీడియో ద్వారా కోరారు. తనకు 18 సంవత్సరాలు నిండాయని, సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని సింధు కుమారి చెప్పింది. తమ కుటుంబ సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని భయమేస్తుందని ఇరువురూ చెప్పారు. కుమారి మాట్లాడుతూ, భర్త కుటుంబాన్ని తన కుటుంబం వేధించే అవకాశం ఉందని, తనకు భయమేస్తోందని పేర్కొంది. ఈ మేరకు నూతన దంపతులు విడుదల చేసిన వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.

Read Also- H1B Visa Fee: హెచ్-1బీ ఫీజు పెంచిన ట్రంప్‌కి షాక్.. భారత్‌కు వచ్చే యోచనలో అమెరికా కంపెనీలు!

తన వయసు 18 సంవత్సరాలు దాటిందని, మాహతోను ఎలాంటి బలవంతం లేకుండా, స్వేచ్ఛగా వివాహం చేసుకున్నాని ఆమె వివరించింది. అతడు తనను కిడ్నాప్ చేయలేదని చెప్పింది. పోలీసులు తన భర్తను లేదా అతడి కుటుంబాన్ని వేధించవద్దంటూ చేతులెత్తి వేడుకుంది. మాహతో స్పందిస్తూ, తాను నిజంగా కుమారిని ప్రేమిస్తున్నానని, ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండబోతున్నామంటూ అన్నాడు. తన కుటుంబ సభ్యులు వేధింపులకు గురికాకుండా చూడాలని పోలీసుల్ని వేడుకున్నాడు. కాగా, ఈ వ్యవహారంపై జముయ్ పోలీసు అధికారి అమరేంద్ర కుమార్ స్పందించారు. ఈ ప్రేమ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని, ఇరు కుటుంబాలతో మాట్లాడతామని చెప్పారు.

Just In

01

Localbody Elections: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ వ్యూహం ఇదేనా?

Gudem Village: ఆ గ్రామంలో 38 ఏళ్ల నుంచి ఎన్నికలకు దూరం.. కారణం ఏంటంటే?

Asia Cup Trophy Row: ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకపోవడంపై నక్వీని నిలదీసిన బీసీసీఐ!

Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఎంత పెంచారంటే..?

Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గెలుపు స్ట్రాటజీ.. ప్రణాళిక ప్రతిపాదనలకు సీఎం గ్రీన్ సిగ్నల్!