Vijay
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన

Vijay Breaks Silence: ఇటీవల ఏకంగా 41 మంది దుర్మరణానికి కారణమైన విషాదకర తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ (Vijay Breaks Silence) మంగళవారం తొలిసారి స్పందించాడు. వీడియో ద్వారా ఒక బహిరంగ సందేశాన్ని విడుదల చేశాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తొక్కిసలాట విషాదం వెనుక కుట్ర దాగి ఉండొచ్చన్న సంకేతాలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అధికార డీఎంకేపై (ద్రవిడ మునేత్ర కజగం) విజయ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘‘ముఖ్యమంత్రి సార్… మీకేమైనా కుట్రలు ఉంటే నన్ను ఏమైనా చేసుకోండి. నేను ఇంట్లో లేదా, ఆఫీస్‌లోనే ఉంటాను. అంతేకానీ, నా వెంట ఉన్న నాయకుల్ని మాత్రం టచ్ చేయొద్దు ’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తొక్కిసలాట ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో సందేశం విడుదల చేశాడు.

కరూర్ (వెస్ట్) జిల్లా టీవీకే కార్యదర్శి మతియజగన్‌పై హత్యాయత్నం, హత్యకు సమానమైన నేరం, ప్రజల ప్రాణాలకు హాని కలిగించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడితో పాటు పార్టీ ముఖ్యనేతలు జనరల్ సెక్రటరీ ఎన్. బస్’ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ శేఖర్‌లను కూడా పోలీసులు కేసులో చేర్చడంతో విజయ్ ఈ విధంగా స్పందించారు. కాగా, విజయ్‌ ఉద్దేశపూర్వకంగానే బలప్రదర్శన చేయాలనుకున్నారని, అందుకే సభ స్థలానికి ఆలస్యంగా వచ్చినట్టు ఓ పోలీసు అధికారి కూడా ఆరోపించారు.

Read Also- Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

నా మనసు బాధతో నిండిపోయింది

తన జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితిని ఇదివరకెప్పుడూ ఎదుర్కోలేదని తొక్కిసలాట ఘటనపై విజయ్ విచారం వ్యక్తం చేశాడు. ‘‘నా శరీరం, మనస్సు తీవ్రమైన బాధతో నిండిపోయాయి. కరూర్‌లో జరిగిన ఈ అనూహ్యమైన తొక్కిసలాట దుర్ఘటన కారణంగా సోదర, సోదరీమణులను కోల్పోయాను. మాటల్లో చెప్పలేనంత బాధ, ఆవేదన నాలో ఉన్నాయి. నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబ సభ్యులు అందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మీ ప్రేమ, మీ నమ్మకం, నాపై మీరు చూపిస్తున్న అభిమానం… ఇవన్నీ ఎప్పటికీ నా గుండెల్లో పదిలంగా ఉంటాయి. ఈ దుర్ఘటనకు సంబంధించిన నిజం త్వరలోనే బయటపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ కష్టకాలంలో మీ అందరి మద్దతు నాకు అవసరం. ధన్యవాదాలు’’ అని విజయ్ పేర్కొన్నాడు. కాగా, కరూర్‌లో టీవీకే ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున విజయ్ పరిహారాన్ని కూడా ఇప్పటికే ప్రకటించాడు.

Read Also- Mega OG Pic: ‘మెగా ఓజీ పిక్’.. పవన్ సినిమాపై చిరు రివ్యూ అదిరింది

ప్రొటోకాల్ పాటించాం

అయితే, తొక్కిసలాట ఘటన రోజు తన పార్టీ ఏవిధమైన తప్పులు చేయలేదని అన్నారు. ప్రోటోకాల్‌ను పాటించామని విజయ్ తెలిపాడు. పూర్తి భద్రత ఉన్న ప్రదేశంలోనే సభను నిర్వహించామని వీడియోలో వివరించారు. ‘‘నా పర్యటన సమయంలో ప్రజల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని భావించాం. అన్ని రాజకీయ విషయాలను పక్కన పెట్టి, భద్రమైన ప్రదేశాల్లో సభలు జరగాలనే ఉద్దేశంతో పోలీసుల అనుమతిని తీసుకున్నాం. అయినా… జరగకూడని విషాదం జరిగిపోయింది. ఇది నాకు జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సందర్భం. నా హృదయం పూర్తిగా బాధతో నిండిపోయింది’’ అని విజయ్ వ్యాఖ్యానించాడు.

Just In

01

Gaza Peace Plan: హమాస్‌కు ట్రంప్ ‘శాంతి ఒప్పందం’ ప్రతిపాదన.. ఒప్పుకుంటారా?

PCC Mahesh Kumar Goud: ఆదిత్య కన్స్రక్షన్ పై పూర్తి స్థాయిలో ఎంక్వైయిరీ.. మహేష్​ కుమార్ గౌడ్

Srinivas Goud: రిజర్వేషన్ల పెంపు జీవో చెల్లదని వారికి తెలియదా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్

Pre Wedding Show: మొన్న ‘వైరల్ వయ్యారి’.. ఇప్పుడు ‘వయ్యారి వయ్యారి’.. మరో క్యాచీ లవ్ సాంగ్

Gadwal District: దేవుని భూమిపై రియల్ ఎస్టేట్ కబ్జాదారుల కన్ను.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి వినతి!