Blast-In-Pakistan
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Quetta Blast: పాకిస్థాన్‌లో శక్తివంతమైన కారుబాంబు పేలుడు.. 13 మంది దుర్మరణం

Quetta Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. క్వెట్టా నగరంలో (Quetta Blast) మధ్యాహ్న సమయంలో జార్గున్ రోడ్డు మార్గంలో ఉన్న ఫ్రంటియర్ కానిస్టిబ్యులరీ (పాక్ పారామిలిటరీ ఫోర్స్ ) ప్రధాన కార్యాలయానికి ఒక మూలలో ఈ  శక్తివంతమైన పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 13 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. శక్తివంతమైన పేలుడు కావడంతో ఆ భారీ శబ్దం క్వెట్టా పట్టణంతో పాటు చుట్టపక్కల ప్రాంతాల వారికి కూడా వినిపించింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు, భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పేలింది కారు బాంబు!

క్వెట్టాలో పేలింది కారు బాంబు అని ప్రాథమిక కథనాల ప్రకారం తెలుస్తోంది. కారులో భారీగా పేలుడు పదార్థాలు నింపి పేలుడుకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. కాగా, పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో తుపాకీ కాల్పుల మోత కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో, ఏం జరుగుతోందోనన్న భయంతో చుట్టుపక్కలవారు వణికిపోయారు. కాగా,  సమాచారం అందిన వెంటనే పేలుడు ప్రదేశానికి రెస్క్యూ బృందాలు, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. పేలుడు ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టినట్టుగా పాకిస్థాన్‌కు చెందిన ‘ఆజ్ న్యూస్’ వెల్లడించింది. వాహనాల రద్దీ ఉన్న రోడ్డుపై బాంబు పేలుడు జరిగిందంటూ పాకిస్థానీయులు పోస్టులు పెడుతున్నారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్‌గా మారాయి.

Read Also- Tilak Varma: హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. పాక్‌పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌పై.. ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ పేలుడుపై క్వెట్టాలోని స్పెషల్ ఆపరేషన్స్‌కు చెందిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) మొహమ్మద్ బలూచ్ స్పందించారు. పేలుడు పదార్థాలు నిండిన వాహనం మోడల్ టౌన్ నుంచి హాలి రోడ్ వైపుకు వెళుతున్న సమయంలో, ఫ్రంటియర్ కానిస్టిబ్యులరీ ప్రధాన కార్యాలయానికి సమీపం పేలిందని చెప్పారు. ఈ పేలుడు ధాటికి ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చనే ఆందోళనతో, నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. పేలుడు జరిగిన తీరు, ఇతర వివరాలు నిర్దారించేందుకుగానూ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Read Also- Tilak Varma: హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. పాక్‌పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌పై.. ఆసక్తికర వ్యాఖ్యలు

బలూచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ స్పందిస్తూ, ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడుతో 10 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించగా, మిగిలినవారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గాయపడినవారిని సివిల్ ఆసుపత్రికి, ట్రామా సెంటర్‌కు తరలించామని చెప్పారు. కాగా, బాంబు పేలుడు, అనంతరం జరిగిన కాల్పుల్లో ఫ్రంటియర్ కానిస్టిబ్యులరీకి చెందిన ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.

Just In

01

Old Age Couple: 80 ఏళ్ల వయసులో వృద్ధ జంట ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన

Warangal District: స్థానిక సమరంపై సందిగ్ధంలో ఆశావహులు.. ఇంకేమైనా మార్పులు వచ్చేనా!

Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!