Viral News (Image Source: AI)
Viral

Viral News: అమ్మకు బాలేదని లీవ్ అడిగిన ఉద్యోగి.. అందరి తల్లులు పోయేవారే.. డ్రామా చేయకంటూ బాస్ ఫైర్

Viral News: సెలవుల విషయంలో ప్రైవేటు సంస్థలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కింది ఉద్యోగికి సెలవు ఇచ్చే విషయంలో పైస్థాయి ఉద్యోగులు కాస్త కటువుగానే వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే యూసీఓ బ్యాంక్ సీనియర్ అధికారి వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. కన్నతల్లి ఐసీయూలో ఉందని సెలవు అడిగిన ఉద్యోగికి సీనియర్ ఉద్యోగి ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే?

యూసీఓ బ్యాంక్ సీనియర్ అధికారి అమానుష ప్రవర్తనకు సంబంధించిన ఒక ఈమెయిల్ స్క్రీన్‌షాట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాంక్ టాప్ మేనేజ్ మెంట్ కు బాధిత ఉద్యోగి పంపిన ఈమెయిల్.. సెలవుల విషయంలో ప్రైవేటు సంస్థలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో చెప్పేందుకు అద్దం పడుతోంది. ఈమెయిల్ స్క్రీన్ షాట్ ప్రకారం.. తమిళనాడుకు చెందిన యూసీఓ బ్యాంక్ ఉద్యోగి.. చెన్నై జోనల్ హెడ్ ఆర్.ఎస్. అజిత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

‘కూలీలుగా చూస్తున్నాడు’

చెన్నై జోనల్ హెడ్ అజిత్ కింది ఉద్యోగులను ప్రొఫెషనల్స్ లా కాకుండా బానిసలుగా లేదా కూలీలుగా చూస్తున్నాడని బాధిత ఉద్యోగి ఆరోపించారు. ప్రతీ విషయంలో హుకూం జారి చేస్తున్నాడని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సెలవులు కోరినప్పటికీ ఆయన తన యాటిట్యూడ్ చూపిస్తూ వాటిని తిరస్కరించారని ఫిర్యాదులో మండిపడ్డారు.

‘అందరి తల్లులు చనిపోతారు’

ఒక బ్రాంచ్ హెడ్‌ తల్లి ఐసీయూలో ఉండగా సెలవు ఇవ్వడానికి జోనల్ హెడ్ చాలా రాద్దాంతం చేశాడని కింది ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలవు ఇవ్వడానికి ముందే తిరిగి ఎప్పుడు వస్తావో చెప్పాలంటూ జోనల్ హెడ్ ప్రశ్నించారని తెలిపారు. కొద్ది రోజుల తర్వాత బ్రాంచ్ హెడ్ తల్లి మరణించగా.. జోనల్ హెడ్ చాలా నీచంగా మాట్లాడారని బాధిత ఉద్యోగి తెలిపారు. ‘అందరి తల్లులు చనిపోతారు. డ్రామా చేయకు. ప్రాక్టికల్‌గా ఉండు. వెంటనే జాయిన్ అవ్వు, లేకపోతే LWP (లీవ్ వితౌట్ పే) వేస్తాను’ అని జోనల్ హెడ్ హెచ్చరించారని ఈమెయిల్‌లో చెప్పుకొచ్చారు.

‘ఉద్యోగుల సమస్యలు పట్టవు’

అదే విధంగా.. మరో బ్రాంచ్ హెడ్ ఏడాది వయసున్న కూతురు ఆస్పత్రిలో ఉన్నప్పుడు, మరో అధికారి భార్యకు అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు జోనల్ హెడ్ చాలా నిర్లక్ష్యంగా స్పందించారని ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల కుటుంబ సమస్యల కంటే వారు ఆఫీసు రావడానికే జోనల్ హెడ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

Also Read: Uttam Kumar Reddy: ప్రజాహిత చేవెళ్ల ప్రాణహిత డీపీఆర్‌లు సిద్ధం చేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక అదేశాలు

నెటిజన్ల రియాక్షన్

బ్యాంక్ జోనల్ హెడ్ పై కింది ఉద్యోగి చేసిన ఆరోపణలకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘మానవత్వం లేని క్రమశిక్షణ.. పతనంతో సమానం. లీవ్ కండిషన్స్ ను అత్యవసర సమయాల్లో సడలించవచ్చు. కానీ ఈ బాస్ అలా చేయలేదు. ఇది అతని క్రూరమైన మసస్తత్వానికి అద్దం పడుతోంది’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘ఉద్యోగులను క్రూరంగా అణిచివేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ ను రిజర్వ్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ లకు ట్యాగ్ చేశారు.

Also Read: KTR: బాకీ కార్డుతో ప్రభుత్వ భరతం పడతాం.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

Just In

01

Guvvala Balaraju: జన గర్జనతో గర్జించిందేంటి?.. కేటీఆర్ పై గువ్వల బాలరాజు ఫైర్!

India vs Pakistan: టీమిండియా తొండి చేసింది.. ఎవరూ ఆ జట్టుతో ఆడొద్దు.. పాక్ మాజీ ఆటగాడి పిలుపు

Kavitha: స్థానికంలో జాగృతి పోటీ?.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేయాలనే యోచన

Jupally Krishna Rao: అబద్దాలపై బతకడం కేటీఆర్‌కు అలవాటు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు!

Non Veg Shops Closed: మాంసం ప్రియులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్.. జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన