Telangana Assembly: బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో చేరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ (Telangana Assembly)లోని స్పీకర్ ఛాంబర్‌లో విచారణ చేశారు. 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ ముందు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నలుగురు ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై వాదనలు జరిగాయి.
అనర్హత పిటిషన్లు దాఖలు
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తమ న్యాయవాదులతో ట్రిబ్యునల్ ఎదుట హాజరయ్యారు. పిటిషనర్లుగా ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ న్యాయవాదులతో వచ్చారు. అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఎదుటి పక్షం న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్‌లో అనేక ప్రశ్నలు సంధించారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే ఎమ్మెల్యేలు సీఎంను కలిశారని, పార్టీ మారినట్లు పిటిషన్లు ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్లు సమాచారం.
Also Read: POK Protests: పీవోకేలో కల్లోలం.. సామాన్యులపై ఆర్మీ, ఐఎస్ఐ కాల్పులు.. ఇద్దరు మృతి
ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఇరుపక్షాల న్యాయవాదులు
మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలు ఆధారంగానే పిటిషన్లు వేసినట్లు ఆధారాలు ఇవ్వడం చెల్లుబాటు ఎలా అవుతుందని? రాజకీయ ఎదుగుదలను చూసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు దాఖలు చేసినట్లు కనిపిస్తోందనే వాదనలు చేశారని సమాచారం. వారికి ధీటుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఎదుటి పక్షం న్యాయవాదులను పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అడిగిన ప్రతీ ప్రశ్నకు ఫొటోలు, మీడియా కథనాలు, కాంగ్రెస్ కండువా లు కప్పుకున్నఆధారాలు, కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న పొటోలు, వీడియోల ఆధారాలు చూపినట్లు తెలిసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఇరుపక్షాల న్యాయవాదులు ప్రశ్నలతో వాడిగా జరినట్లు సమాచారం. తిరిగి అక్టోబర్ 1న బుధవారం మరోసారి విచారణ చేయనున్నారు.
10మంది కాంగ్రెస్ లో చేరిందివాస్తవం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పది మంది ఎమ్మెల్యేలు చేరిన విషయం బహిరంగ రహస్యమేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రాత్రి గన్ పార్కు వద్ద ఎమ్మెల్యేలు సంజయ్, చింతప్రభాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ చేపట్టగా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారన్నారు. అయితే స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట ప్రారంభమైన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి
న్యాయవాదులు అసంబద్ద ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామన్నారు. పార్టీ మారి అసంబద్దంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పష్టంగా చెప్పామన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో బహిరంగంగా చేరారన్నారు. కాంగ్రెస్ లో చేరలేదని కోర్ట్ కు ,అసెంబ్లీ స్పీకర్ కు అఫిడవిట్ ఇచ్చారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే లకు సిగ్గుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీడియా లో వచ్చిన వార్తలను స్పీకర్ కు ఇచ్చామన్నారు. పార్టీ మారారని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అందజేశామని తెలిపారు.
Also Read: Sabitha Indra Reddy: స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం.. సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు