Bathukamma Flowers: సాంప్రదాయబద్దంగా జరుపుకునే పండగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం. పువ్వులు (Bathukamma Flowers) ఆకులు గౌరమ్మ పసుపు కుంకుమ మహిళలు వాటిని క్రమపద్దతిలో పేర్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తారు. ప్రకృతి ఒడిలో ఒక్కో చెట్టుకు, తీగకు వికసించిన పూలు అందాన్ని పరిమళాలను వెదజల్లడమే కాక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ పూల పండగలో ఔషధాలు మెండుగానే ఉన్నాయి. ఒక్కో పువ్వులో రకరకాల ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.
ఎంతో గొప్ప విశిష్టత
తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూలకు ఎంతో గొప్ప విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధ గుణాలకు ఎంతో విలువ ఉంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. చెరువు నీటిలో ఉన్న మలినాలు ఔషధ గుణాలు కలిగిన పూలతో మటుమాయమై నీటి శుద్ది జరుగుతుంది. ఆ నీటి స్నానం చాలా మంచిది. ఇలా బతుకమ్మ ఆట, పాటలకే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ దోహద పడుతుంది.
Also Read: Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం
తంగేడు
పల్లె ప్రాంతాల్లో, అడవిలో తంగేడు పువ్వులు సహజ సిద్దంగా లభిస్తాయి. తంగేడు చెట్టు శాస్త్రీయ నామం సెన్నాక్యూలేటా. పసుపు పచ్చ పుష్పాలు గుత్తులుగా పూస్తుంది. మొగ్గలు, పువ్వులు, గింజలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మూత్రకోశ వ్యాధులకు, కీళ్ల నొప్పులకు తంగేడును వినియోగిస్తారు. పూలను కోసేందుకు చెట్టు వద్దకు వెళ్లడం..పూలను తాకడం, వాటి గాలి సోకడం వల్ల మహిళల చర్మ ఉదర కోశ వ్యాధుల నివారణకు ఉపయోగంగా ఉంటుంది. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తంగేడు చెట్టు నుంచి మందును తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతటి విషిష్టత ఉన్న తంగేడు పూలను నాటి పెద్దలు సిగలో సింగారించే వారు.
గునుగు
గునుగు పూలు గడ్డి జాతికి చెందిన సహజ వర్ణపూలు. శాస్త్రీయ నామం సెలోసియా అర్జెంటీయా. పెద్ద ప్రేగులో బద్దె పురుగులను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ పువ్వులనే అతిసార వ్యాధి నివారణకు మందుగా వాడతారు. కంటి సంబంధ రోగ నివారణకు ఉపయోగిస్తారు. గునుగుపూలు, అందం, అందులోని తెల్లదనం ఎతగానో ఆకట్టుకుంటుంది. ఈ పూలను నీటిలో వేస్తే మలినాలను పీల్చుకొని శుభ్రం చేస్తుంది.
చామంతి
స్త్రీలు అలంకరించుకునేందుకు, దండగా వేసుకునేందుకు చామంతి పూలను ఎక్కువగా ఉపయోగించడానికి కారనం దీనిలో ఆరోగ్యకరమైన లక్షణాలు అధికంగా ఉండటమే. చామంతి వాస్తీయ నామం కైసాంధఙమం ఇండికోర. దీంతో ఫైరటమ్ అనే కీటక నాశక మందులను తయారు చేస్తారు. యాంటిబయాటిక్‌గా కూడా వాడతారు. శరీరానికి చలువ చేయడమే కాకుండా జ్వరం, తాపం, అగ్ని మాంద్యము వంటి వ్యాధుల నుంచి ఉపశమనం చేస్తుంది.
గుమ్మడి
గుమ్మడి పూలు లేకుండా బతుకమ్మ పేర్చరు. ఈ పూవులోని పిందెల రూపాన్ని శ్రేష్టంగా అలంకరిస్తారు. శాస్త్రీయ నామం కుకుర్బిటా మాక్సిమా. ఇందులో విటమిన్ ‘ఏ’ సీ’ అధికంగా అధికంగా ఉండటం ద్వారా కంటి సంబంధ రోగాలకు ఔషధంగా వాడతారు. వృద్దాప్యంలో తలెత్తే కీళ్ల నొప్పులను తగ్గించే మందుల తయారీలో, సబ్బులు, కాస్టోక్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రొటెస్ట్ గ్రంధికి హాని కలిగించకుండా చేస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు.
Also Read: Adultery: వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
మందార
ఆకర్షణీయంగా కనిపించే మందారం పువ్వులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆకర్షణీయ పత్రాల్లో ఈ పుష్పాన్ని వాడతారు. ముఖ్యంగా వెంటుకలను నల్లబర్చడానికి తయారు చేసే నూనెలో మందార పుష్పాలను వినియోగిస్తారు. అందుకే ఈ పుష్పాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. సౌందర్య సాధనాల తయరీలోనూ మందారాలను వాడతారు. అతిసారా వ్యాధితో బాధపడే వారికి మందారం ఉపశమనం కలిగిస్తుంది. ఈ పుష్పాలను ఎండబెట్టి నూనెలో మరిగిచి తలకు రాసుకున్నట్లయితే తలనొప్పి త్వరితగతిన తగ్గి ఉపశమనం ఇస్తుంది.
బంతి
బంతి పూలను బతుకమ్మలో పేర్చడం తప్పనిసరి. దీని శాస్త్రీయ నామం క్రిసాధిమమ్ బయాన్కో బంతి పువ్వు చలువ దనానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాలు శుద్ది చేసి రక్త సరఫరాను మెరుగు పర్చడానికి సరఫరా చేసే ఔషధంలో బంతిపువ్వును వినియోగిస్తారు. గొంతు సంబంధిత వ్యాధులను నయం చేసే లక్షణం ఈ పువ్వులో ఉన్నాయి. సూక్ష్మ క్రిములను నాశనం చేయడంతో, ఆరోగ్యకరమైన సుగంధ తైలాలు తయారు చేయడంలో రకక్త స్రావానికి మందుగా ఉపయోగిస్తారు.
తామర
తామర పువ్వు శాస్త్రీయ నామం విలుంబో న్యూ సిఫెరా. దీనిని రక్తస్రావ నివారణకు మందుగా వాడతారు. పువ్వులను జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన ఔషదంగా..సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. గడ్డిపువ్వు గడ్డి పువ్వు శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రోకెంబెన్స్ యాటీ బయాటిక్. దీనిని యాంటి వైరల్‌గా వాడతారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తస్రావాన్ని తగ్గించడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
వామ
వామ పువ్వు శాస్త్రీయ నామం ట్రెకోస్పెర్మమ్ మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. యాంటి సెప్టిక్ గా ఉపయోగిస్తారు.
బీర
ప్రస్తుత సీజన్‌లో బీర పువ్వులు బతుకమ్మలో పేరుస్తారు. శాస్త్రీయ నామం లాఅప్యు టాంగులా. చర్మ సంబంధ వ్యాధులకు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. రంగుల యారీలో ఎంతగానో వినియోగిస్తారు.
దోస కామెర్ల
వ్యాధి నివారణ కోసం దోస పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తపోటు తక్కువ ఉన్నవారి కోసం దీనిని వాడతారు. శాస్త్రీయ నామం కుకుమిస్‌సాటిన్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మః చైర్‌పర్సన్ ఎస్.కవిత
Also Read: Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!