UP Madrassa (Image Source: Twitter)
జాతీయం

UP Madrassa: యూపీలో ఘోరం.. 40 మంది బాలికలను.. బాత్రూమ్‌లో బంధించి..

UP Madrassa: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9-14 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 40 మంది బాలికలను ఓ మదరసాలోని టాయిలెట్లలో బంధించి ఉంచారు. తనిఖీల సందర్భంగా ఈ విషయం బయటపడినట్లు పాయగ్‌పూర్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ (SDM) అశ్విని కుమార్ పాండే తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..

పాయగ్ పూర్ డివిజన్ లోని పాహల్వారా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండానే మదరసా నిర్వహిస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. మూడంతస్తుల భవనంలో దానిని నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అశ్విని కుమార్.. మదరసా నడుపుతున్న భవనంలో తనిఖీలు చేపట్టారు. అయితే తమ కంట పడకుండా విద్యార్థినులను బాత్రూమ్ లో నిర్వాహకులు దాచేశారని మెజిస్ట్రేట్ తెలిపారు.

బాత్రూమ్ తలుపు తీయగా..

తనిఖీల అనంతరం సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. ‘మేము భవనాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు నిర్వాహకులు.. పైఅంతస్తుకు వెళ్లనీయలేదు. పోలీసుల సాయంతో మేము పైకి వెళ్లాం. టెర్రస్‌పై ఉన్న టాయిలెట్స్ తలుపులు మూసివేసి ఉన్నట్లు గుర్తించాం. తలుపు తెరవగానే 40 మంది బాలికలు ఒక్కొక్కరిగా బయటికొచ్చారు. వారు భయాందోళనకు గురై ఏమీ సరిగ్గా చెప్పలేకపోయారు’ అని అశ్విని కుమార్ పాండే వివరించారు.

మద్రసా చట్టబద్ధతపై సందేహాలు

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మొహమ్మద్ ఖాలిద్‌ స్పందిస్తూ ఈ సంస్థ రిజిస్ట్రేషన్, చట్టబద్ధత గురించి పరిశీలించాలని ఆదేశించారు. ‘ఈ మదరసా మూడు సంవత్సరాలుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని చెప్పారు. ‘మేనేజ్‌మెంట్, సిబ్బంది కూడా ఏ పత్రాలు చూపలేకపోయారు. 2023లో జరిగిన సర్వేలో బహ్రైచ్‌లో 495 నమోదు లేని మదరసాలు గుర్తించబడ్డాయి. అయితే ఈ మదరసా అప్పట్లో అధికారుల దృష్టికి రాలేదు’ అని మైనార్టీ సంక్షేమ అధికారి అన్నారు.

Also Read: Ind vs Pak Asia Cup Final: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టీమిండియాను వేధిస్తున్న చెత్త రికార్డు.. ఓటమి తప్పదా?

మదరసా మూసివేత

ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న నేపథ్యంలో
పాహల్వారా గ్రామంలోని మదరసాను అధికారులు మూసివేశారు. బాలికలను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించేశారు. మదరసాలో 8 గదులు ఉండగా.. విద్యార్థినులను బాత్రూమ్ లోనే ఎందుకు దాచారాని ఉపాధ్యాయురాలు తక్సీం ఫాతిమాను అధికారులు ప్రశ్నించారు. అధికారులు వస్తున్నారన్న కంగారులో అలా టెర్రస్ పైకి పంపి.. బాత్రూమ్ లో వారిని దాచిపెట్టినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్వాహకులపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఏఎస్పీ రమానంద ప్రసాద్ తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఫిర్యాదు అందిందే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read: Bigg Boss Telugu Promo: బిగ్ బాస్‌లో అర్ధరాత్రి మద్దెల దరువు.. ఇంటి నుంచి స్టార్ కంటెస్టెంట్ ఔట్

Just In

01

Chikiri Song: రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్‌పై వైరల్ అవుతున్న ఆర్జీవీ కామెంట్స్.. బుచ్చి రిప్లే అదిరిందిగా..

Dhoni Viral Video: ఫ్యాన్ బైక్‌పై ధోనీ సంతకం.. 3 లక్షల బైక్ 30 కోట్లదైంది!

Swetcha Effect: గద్వాల్లో అక్రమ ఇసుక తయారీదారులపై కేసు నమోదు

Ande Sri Funeral: అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్.. అంత్యక్రియలు పూర్తి.. ప్రకృతి కవికి కన్నీటి వీడ్కోలు

Warangal District: ఓరుగల్లుతో అందెశ్రీ ది విడదీయరాని బంధం.. ఆయన సేవలు చిరస్మనీయం అంటూ..!