Aadhaar Download WhatsApp: భారతదేశంలో ప్రతి పౌరుడికీ ఆధార్ కార్డు ఒక కీలక గుర్తింపు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఈ కార్డు ఉంది. అలాగే, లేని వారు కూడా త్వరగా పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకప్పుడు ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకుని వచ్చే వాళ్ళు. అక్కడికి వెళ్లినా ఒక్కోసారి పని అవ్వదు. అయితే, ఇప్పటి నుంచి అలా దిగులు పడాల్సిన అవసరం లేదు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక సరికొత్త సౌలభ్యాన్ని పరిచయం చేసింది.
వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్!
UIDAI ఈ ప్రక్రియను ఇప్పుడు సులభతరం చేసింది. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.దీనికోసం UIDAI ప్రత్యేకంగా ఒక నంబర్‌ను కేటాయించింది. ఆ నెంబర్ ఇదే +91-9013151515.
నంబర్ సేవ్ చేయండి
1. మీ ఫోన్‌లో ఈ నంబర్‌ను ” హెల్ప్‌డెస్క్” పేరుతో సేవ్ చేయండి.
2. వాట్సాప్‌లో ఈ నంబర్‌కు “హాయ్” (ఇంగ్లీష్‌లో) అని మెసేజ్ చేయండి.
3. మైగవ్ హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ మీకు స్టెప్ బై స్టెప్ సూచనలు అందిస్తుంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి.
4. మీ ఆధార్ కార్డు డిజీ లాకర్‌తో అనుసంధానించబడి ఉంటే, మీరు దాన్ని నేరుగా వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు
1. మీ ఆధార్ కార్డు డిజీ లాకర్‌లో ఇప్పటికే లింక్ అయి ఉండాలి.
2. ఒకేసారి ఒకే కాపీని మాత్రమే డౌన్‌లోడ్ అవుతుంది.
3. ఈ సేవ 24×7 అందుబాటులో ఉంటుంది, అంటే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఉపయోగించవచ్చు.
ఈ సేవ ఎందుకు ప్రత్యేకం?
ఈ కొత్త సౌకర్యం గ్రామీణ ప్రాంతాలు, రవాణా సౌలభ్యం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో నివసించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. బయటకు వెళ్లలేనప్పుడు ఇంట్లోనే ఉండి .. వాట్సాప్‌లో కొన్ని క్లిక్‌లతో ఆధార్ కార్డు సులభంగా పొందవచ్చు. అంతే కాదు, ఇది మీ సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.