NATO on PM Modi (Image Source: Twitter)
జాతీయం

NATO on PM Modi: ప్రధాని మోదీపై నాటో చీఫ్ సంచలన ఆరోపణలు

NATO on PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ప్రధాని మోదీ అతి చొరవ చూపారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడి వ్యూహాన్ని చెప్పాలని ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అడిగారని నాటో చీఫ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

నాటో చీఫ్ ఇంకా ఏమన్నారంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 50% ప్రతీకార సుంకాల గురించి నాటో చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడారు. న్యూయార్క్ లోని సాధారణ సమావేశంలో పాల్గొన్న అనంతరం.. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై పన్నులు విధించడం.. రష్యాపై పెను ప్రభావం చూపిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే నాటో చీఫ్ మరింత దూకుడుగా మాట్లాడుతూ ఉక్రెయిన్ పై మీ వ్యూహాం ఏంటో చెప్పాలని పుతిన్ ను మోదీ అడిగారని ఆరోపించారు. అయితే నాటో చీఫ్ వ్యాఖ్యలపై మాస్కో గానీ, భారత్ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ట్రంప్ ప్రతీకార సుంకాలు

రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. భారత్ పట్ల దూకుడు వైఖరిని అవలంభిస్తున్నారు. మోదీ తన స్నేహితుడని చెప్పుకుంటూనే సుంకాల పేరుతో భారత్ దిగుమతులపై ఆంక్షలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇటీవల హెచ్ -1బీ వీసా ఫీజును సైతం ఆమాంతం లక్ష డాలర్లకు పెంచి భారతీయ ఐటీ ఉద్యోగులపై ట్రంప్ బిగ్ బాంబ్ వేశారు. అంతటితో ఆగకుండా నాటో దేశాలు భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు విధించి.. రష్యా చమురు కొనుగోళ్లను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

రష్యాపై కఠిన ఆంక్షలు

మరోవైపు రష్యాపై కూడా కఠిన ఆంక్షలు విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో సెప్టెంబర్ 13న రష్యా గురించి ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై ‘భారీ ఆంక్షలకు సిద్ధం’ అని స్పష్టం చేశారు. ఇందుకు నాటో దేశాలు అంగీకరించి.. మాస్కో చమురు కొనుగోళ్లు ఆపాలని పేర్కొన్నారు. ‘కొన్ని దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్న తీరు షాకింగ్. ఇది మీ చర్చల శక్తిని బలహీనపరుస్తోంది’ అని ఆయన విమర్శించారు. చైనాపై 50%-100% సుంకాలు విధిస్తే.. రష్యాపై దాని పట్టు తగ్గిపోతుందని అది యుద్ధాన్ని ముగించడంలో సహాయపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Also Read: OG collections: మొదటి రోజు రికార్డులు సృష్టించిన ‘ఓజీ’ కలెక్షన్స్.. ఎంతంటే?

భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఒక భారత ప్రతినిధి బృందం ఇటీవల అమెరికాలో పర్యటించింది. న్యూయార్క్‌లో అమెరికా అధికారులతో వాణిజ్య చర్చలు జరిపింది. ఇందులో వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి, భారత చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 10న ట్రంప్ ట్రూత్ లో స్పందిస్తూ తన గుడ్ ఫ్రెండ్ ప్రధాని మోదీతో త్వరలో మాట్లాడతానని ప్రకటించారు. దానికి మోదీ సైతం రిప్లై ఇచ్చారు. ‘భారత్-అమెరికా భాగస్వామ్యం అపార అవకాశాలను తెరవనుంది. మా బృందాలు త్వరితగతిన చర్చలు పూర్తిచేయడానికి కృషి చేస్తున్నాయి’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.

Also Read: Heavy Rains Alert: వర్షాలపై బిగ్ వార్నింగ్.. రాబోయే 5 రోజులు అల్లకల్లోలం.. నేడు, రేపు మరింత జాగ్రత్త

Just In

01

New Liquor Shops: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల..ఈ రూల్స్ ప్రకారమే కేటాయింపులు పూర్తి వివరాలు ఇవే?

Aadhaar Download WhatsApp: ఇంట్లోనే ఉండి వాట్సాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసా.. నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

Ind vs Pak Asia Cup Final: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టీమిండియాను వేధిస్తున్న చెత్త రికార్డు.. ఓటమి తప్పదా?

OTT Movie: ఫేమస్ స్టార్ యాక్టర్ ఒక లేడీ వెయిటర్ ప్రేమలో పడితే.. ఏం జరిగిందంటే?

The Strangers Chapter 2 review: ఎవరో? ఎందుకో? తెలియకుండా చంపేస్తుంటారు.. చూస్తే వణకాల్సిందే..