pawan-kalyan(image :x)
ఎంటర్‌టైన్మెంట్

OG collections: మొదటి రోజు రికార్డులు సృష్టించిన ‘ఓజీ’ కలెక్షన్స్.. ఎంతంటే?

OG collections: తెలుగు సినిమా పరిశ్రమలో ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ అభిమానుల అందరి కలలు నెరవేర్చిన సినిమా ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG). ఈ సినిమా విడుదలైన రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంటూ ప్రభంజనం సృష్టిస్తోంది. సుజీత్ డైరెక్షన్‌లో తయారైన ఈ యాక్షన్ థ్రిల్లర్, పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇమ్రాన్ హాష్మీ, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది. దీనిని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Local Body Elections: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ.. రిజర్వేషన్లపై ఆశలు, ఆందోళనలు

ట్రేడ్ అనాలిస్టుల మేరకు, ‘ఓజీ’ మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూ.70 కోట్లకు చేరాయి. ఇది పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యంత గొప్ప ఓపెనింగ్‌గా నిలిచింది. గ్రాస్ కలెక్షన్స్ విషయంలో ఇండియాలో రూ.100 కోట్లకు పైగా సాధించినట్లు అంచనా. వరల్డ్‌వైడ్ స్థాయిలో మొత్తం కలెక్షన్స్ రూ.90-92 కోట్ల మధ్య ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొన్ని సోర్సుల ప్రకారం, గ్లోబల్ గ్రాస్ రూ.150 కోట్ల వరకు చేరినట్లు కూడా తెలుస్తోంది. ప్రీమియర్ షోలు, పెయిడ్ ప్రీవ్యూలతో కలిపి మొత్తం ఓపెనింగ్ రూ.98 కోట్లకు చేరినట్లు కూడా కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లకు డోకా లేదంటున్నారు అభిమానులు. అభిమానులకు ఫీస్ట్ అందించిన సుజిత్ ను ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తతున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఎసెర్ట్ గా మారింది.

Read also-US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?

రికార్డులు

పవన్ కల్యాణ్ మునుపటి సినిమాలతో పోల్చితే, ‘ఓజీ’ మొదటి రోజు కలెక్షన్స్‌లో ‘వకీల్ సాబ్’ (రూ.34 కోట్లు) ‘భీమ్‌లా నాయక్’ (రూ.35 కోట్లు) వంటి చిత్రాలను దాటి, అతని కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ఇది షా రుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా ఓపెనింగ్ రికార్డ్‌ను కూడా దాటేస్తుందని ట్రేడ్ ఎక్స్‌పర్టులు అంచనా. ‘దేవర’ సినిమా ఓపెనింగ్‌ను (రూ.75 కోట్లు) కూడా మించినట్లు కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ప్రీమియర్ షోలకు టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌ను మరో స్థాయి ‘గ్లోబల్ స్టార్’గా నిలబెట్టిందని అభిమానులు ఆనందిస్తున్నారు. మొదటి రోజు ఇంత భారీ కలెక్షన్స్ సాధించిన ‘ఓజీ’, వీకెండ్‌లో మరో రూ.200 కోట్లు సాధించి రూ.300 కోట్లు మైలురాయి అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అంచనా. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విజయాన్ని పండగలా జరుపుకుంటున్నారు.

Just In

01

New Liquor Shops: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల..ఈ రూల్స్ ప్రకారమే కేటాయింపులు పూర్తి వివరాలు ఇవే?

Aadhaar Download WhatsApp: ఇంట్లోనే ఉండి వాట్సాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసా.. నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

Ind vs Pak Asia Cup Final: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టీమిండియాను వేధిస్తున్న చెత్త రికార్డు.. ఓటమి తప్పదా?

OTT Movie: ఫేమస్ స్టార్ యాక్టర్ ఒక లేడీ వెయిటర్ ప్రేమలో పడితే.. ఏం జరిగిందంటే?

The Strangers Chapter 2 review: ఎవరో? ఎందుకో? తెలియకుండా చంపేస్తుంటారు.. చూస్తే వణకాల్సిందే..