Asia-Cup-Final
స్పోర్ట్స్

Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌‌లో భారత్-పాకిస్థాన్ ఆడాలంటే జరగాల్సిన సమీకరణాలు ఇవే..

Asia Cup Final: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2025లో బుధవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్‌ వేదికగా జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా సునాయాస విజయం సాధించింది. దీంతో, ఇప్పటివరకు కనీసం ఒక్క ఓటమి కూడా ఎరుగకుండా ఫైనల్‌లోకి (Asia Cup Final) దూసుకెళ్లింది. మరి, ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగే ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఢీకొట్టబోయే ప్రత్యర్థి జట్టు ఏది? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఫైనల్ చేరుకునే అవకాశాలు దాయాది దేశమైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు మాత్రమే ఉన్నాయి. దీంతో, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకోవాలని, తుది పోరులో పాక్‌ను ఓడించి ఆసియా కప్ సాధిస్తే ఆ కిక్కే వేరు అని భారతీయ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also- OG Movie: ఓజీ ప్రీమియర్ షోలో దారుణం.. వారికీ 20 లక్షలు నష్టం.. ఫ్యాన్స్ ఎంతకీ తెగించారంటే?

భారత్-పాక్ ఫైనల్ సమీకరణాలు ఇవే

ఆసియా కప్-2025 దశలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. దీంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే, శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్కో విజయం సాధించాయి. దీంతో, ఫైనల్ చేరే అవకాశం ఇరు జట్లకూ ఉంది. భారత్‌ చేతిలో ఓడిపోయిన ఈ రెండు జట్లు.. శ్రీలంకపై చెరో విజయం సాధించాయి. అందుకే, గురువారం (సెప్టెంబర్ 25) పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితం ఆధారంగా ఫైనల్‌ చేరే జట్టు ఖరారు అవుతుంది. అందుకే, రెండో ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు, బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే, 2 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రివర్స్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధిస్తే సమీకరణం మారిపోతుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంటుంది. కాబట్టి, భారత్‌తో ఫైనల్ ఎవరు ఆడతారనేది పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత తేలిపోతుంది. కాగా, శుక్రవారం (సెప్టెంబర్ 26) భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగబోయే సూపర్-4 మ్యాచ్ ఫలితం ఎలాంటి ప్రభావం చూపబోదు.

Read Also- Warangal Land Scam: ప్రైవేట్ పట్టా చూపి ప్రభుత్వ భూమి కాజేసేందుకు కుట్ర చేసిన బడా వ్యాపారి

పాకిస్థాన్‌పై గెలిచి ఫైనల్‌కు వస్తాం: బంగ్లా కెప్టెన్

భారత్‌ చేతిలో ఓటమిపై బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జాకర్ అలీ మాట్లాడుతూ, టీమిండియా చేతిలో ఓటమి ఆశ్చర్యం కలిగించిందని, అయితే, తదుపరి మ్యాచ్‌గా సన్నాహకంగా ఉపయోగపడుతుందని చెప్పాడు. 9 ఓవర్ల వరకు తమ ప్లేయర్లు అద్బుతంగా ఆడారని, ఆ తర్వాత సీన్ మారిపోయిందని చెప్పాడు. అయితే, ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని తెలిపాడు. పాకిస్థాన్‌పై జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి తప్పకుండా ఫైనల్‌కు చేరుతామని జాకర్ అలీ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలో ఆలోచించి, జాగ్రత్తగా బరిలోకి దిగుతామని చెప్పాడు. కష్టపడి విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, బుధవారం రాత్రి భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. కేవలం 37 బంతుల్లో 75 పరుగులు బాదాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగుల స్కోర్ సాధించింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది.

Just In

01

Local Body Elections: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ.. రిజర్వేషన్లపై ఆశలు, ఆందోళనలు

ICC Warning: కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ వార్నింగ్.. జరిమానా విధించే ఛాన్స్!

OTT MOvie: ఇద్దరు ట్విన్స్‌కు ఒకే క్వీన్.. ఇక చూసుకో ఎలా ఉంటదో..

Golden Care: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త కార్యక్రమం.. ప్రారంభించిన సీపీ సుధీర్ బాబు

Seethakka: ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ.. సీతక్క కీలక వ్యాఖ్యలు