OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ రోజు ఆడియెన్స్ ముందుకొచ్చింది. అత్తారింటికి దారేది తర్వాత 12 ఏళ్ల విరామం తీసుకుని పవన్ కళ్యాణ్ మరోసారి ఓజీతో బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నారు.
ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. సినిమా టాక్ కొన్ని చోట్ల అయితే పాజిటివ్ గా ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా కాలం తర్వాత తమ హీరో నుంచి అదిరిపోయే బొమ్మ పడటంతో అభిమానులు సంతోషంగా మునిగిపోయారు. థియేటర్లలో సినిమా చూస్తూ అరుపులు, కేకలతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే, ఈ ఉత్సాహం కొన్నిచోట్ల ఓవర్ గా మారింది.
బెంగళూరులోని KR పురంలో ఉన్న వెంకటేశ్వర థియేటర్‌లో డై హార్ట్ ఫ్యాన్స్ ప్రీమియర్ షో సందర్భంగా కత్తులతో విన్యాసాలు చేస్తూ హంగామా చేశారు. ఈ క్రమంలోనే స్క్రీన్‌కు కత్తి తగలడంతో స్క్రీన్ మొత్తం చిరిగిపోయింది. దీంతో, సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్క్రీన్ మార్చడానికి 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంటున్నారు.
Also Read: Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?
ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. నెటిజన్లు కూడా అభిమానుల మీద ఫైర్ అవుతున్నారు. ఈ అతి ఉత్సాహాన్ని తప్పుబడుతున్నారు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా హవా కొనసాగుతున్నప్పటికీ, ఈ ఘటన ఫ్యాన్స్‌లో హద్దులు మీరిన ఉత్సాహం గురించి చర్చను రేకెత్తించింది.