Warangal Land Scam: గ్రేటర్ వరంగల్ నగరం నడిబొడ్డున ఉర్సు గుట్టలో రూపాయలు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం (Warangal Land Scam) అయింది. ప్రభుత్వ భూమి అని గతంలో రెవెన్యూ అధికారులు నిర్ధారించిన పట్టించుకోకుండా ప్రైవేట్ పట్టా నెంబర్ చూపి ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టాడు (Land Scam) ఓ బడా వ్యాపారి. ఏకంగా ప్రహరీ నిర్మాణం చేసి రూపాయలు కోట్ల విలువ చేసే సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగించాడు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోవడం పై అనేక విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కలతో కుమ్మక్కు అయిన అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి ప్రభుత్వ భూమి ఆక్రమణ అడ్డుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!
పట్టా ప్రైవేట్ …. ప్రభుత్వ భూమి
ఉర్సు గుట్టకు అతి సమీపంలో ఉన్న ప్రైవేట్ పట్టా భూమి కొనుగోలు కొనుగోలు చేసిన బడా వ్యాపారి ఆ పట్టాను చూపి దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్ వేశాడు. అధికారుల నిర్లక్ష్యం ఆసరాగా చేసుకుని సర్వే నంబర్ 355 ప్రభుత్వ భూమిలో ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. ఇంత తంతు జరుగుతున్న ప్రభుత్వ భూమి కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారుల కొమ్ము కాస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన కలెక్టర్ ప్రభుత్వ భూమికి ప్రహరీ నిర్మాణం చేయాలని ఆదేశించిన స్ధానిక అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ప్రభుత్వ భూమికి ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ ఆదేశం
ప్రభుత్వ భూమి ఆక్రమణ పై విచారణ చేపట్టి పూర్తి ఆదారాలు సేకరించిన కలెక్టర్ ప్రైవేట్ వ్యక్తులు చేసే నిర్మాణాలు అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రహారీ గోడ నిర్మాణం ఆపాలంటూ వ్యాపారికి ఖిల్లా వరంగల్ తహసీల్దార్ తహసీల్దార్ ఇక్బాల్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమి పరిరక్షణ కోసం ప్రహారీ నిర్మించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
Also Read: High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్ బెంచ్!