Telangana Politics: సర్కార్ స్ట్రాటజీలో బీఆర్ఎస్ ఇరుక్కున్నదని కాంగ్రెస్ చెప్తున్నది. గ్రూప్ 1 ఫలితాల్లో తమను డ్యామేజ్ చేయాలని బీఆర్ ఎస్ చేసిన కుట్రలను కోర్టు భగ్నం చేసిందని వివరిస్తున్నారు. గ్రూప్-1 ఫలితాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పన్నిన కుట్రలు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో పటాపంచలయ్యాయని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడంతో టీజీపీఎస్సీకి, ర్యాంకర్లకు ఊరట దక్కింది.
హైకోర్టు నిర్ణయంపై గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల రద్దుకు బీఆర్ఎస్ చేసిన కుట్రలు ఫలించలేదని సంబరపడుతున్నరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయిన పరిస్థితి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ కుటిల రాజకీయాలతో తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ర్యాంకర్ల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. గ్రూప్-1 ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్‌వీ నాయకులు అభ్యర్థుల ముసుగులో నిరసనలకు దిగి అడుగడుగునా ఆటంకాలు కల్పించారని విమర్శిస్త
బీఆర్ఎస్ రాజకీయ కుట్ర..
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తును పూర్తిగా విస్మరించింది. నియామక పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు వంటి చర్యలతో లక్షలాది మంది యువత కలలను చిదిమేసిందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయ కుట్రల వల్ల గ్రూప్-1 ఫలితాలు రద్దవ్వడంతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ర్యాంకర్ల తల్లిదండ్రులు ఇటీవల మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 తుది ఫలితాలపై నెలకొన్న అనిశ్చితి వల్ల తాము చాలా మానసిక వేదన అనుభవిస్తున్నామని, తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించడం వల్ల తమకు ఎంతో ఊరట లభించిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad: అందరూ ఈ రూల్స్ పాటించాల్సిందే.. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదేశం
ప్రభుత్వ చిత్తశుద్ధి..ఇచ్చిన హామీలు అమలు…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారదర్శక నియామక ప్రక్రియకు పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. టీజీపీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది.
ఇవే కాకుండా, ఆర్థిక- గణాంక శాఖలో 166 కొత్త పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, త్వరలో మరో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆర్టీసీలో 13 సంవత్సరాల తర్వాత 1,743 ఉద్యోగాలకు (1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు) నోటిఫికేషన్ జారీ అయింది. ఈ విధంగా నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు నాలుగు విద్యుత్ సంస్థల (జెన్‌కో, ట్రాన్స్‌కో, రెండు డిస్కంలు)లో దాదాపు 3,000 పోస్టులను భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది
బీఆర్ ఎస్ కు కోర్టు తీర్పు చెంప దెబ్బ: సామ రామ్మోహన్ రెడ్డి
‘‘గ్రూప్ 1పై హై కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి కోర్టు తీర్పు చెంపపెట్టు. గ్రూప్ 1 ర్యాంకర్లపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నీచ రాజకీయాలు చేశారు. ర్యాంకర్ల తల్లితండ్రులు ఆవేదనకు గురయ్యేలా చేశారు.రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా ఇవ్వలేదు.ఉద్యోగాలు రాకుండా అడ్డుకుని విద్యార్థుల జీవితాలతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆడుకుంటున్నారు.కోర్టు తీర్పుతో న్యాయ స్థానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసం పెరిగింది” అని మీడియా కమిటీ చైర్మన్ సామ వెల్లడించారు.
Also Read: Anil Ravipudi: ‘భూతం ప్రేతం’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?