Nizamabad District: నిజామాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ముంబాయి(Mubai), పుణే(Pune), ఢిల్లీ(delhi), గుజరాత్(Gujaath), హైదరాబాద్(Hyderabad) లాంటి నగరాలకు చెందిన వ్యక్తులు తక్కువ సొమ్ముతో పెట్టుబడుల పేరిట మోసం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సిసిఎస్ ఎసిపి నాగేంద్ర(ACP Ngendhra) సంచలన విషయాలు వెల్లడించారు.
లక్షల రూపాయలు వసూలు..
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిజామాబాద్ నగరంలోని హష్మీ కాలనీకి చెందిన మోయిజ్ ఖాన్(Moiz Khan), సయ్యద్ హైమద్ హసన్(Syed Haimad Hassan), మౌల్వి వాజీద్ హుస్సేన్ ల మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) లో పెట్టుబడి పెట్టాలని అతని వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారు. ముందు కరెన్సీ మార్పిడి, కన్ స్ట్రక్షన్ కంపేనీలలో పెట్టుబడులు అని బాండ్ లు రాసీవ్వడంతో దాదాపు 120 మంది నుంచి సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేశారు. బాండ్ లు రాసీ ఇవ్వడంతో పాటు తెలిసిన వారు గొలుసుకట్టు లాగా ఏర్పడి సంస్థను ఏర్పాటు చేయడంతో వారు నమ్మి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇదిగో వస్తున్నాయి అదిగో ఇస్తున్నాం అంటు దాటవేయడం తో మోసపోయిన బాధితులు పోలిసులకు పిర్యాదు చేశారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?
మోసాలు గుట్టు రట్టు
సాఫ్ట్ వేర్ ఇంజనీర్లమని యాప్(App) దేవలప్ చేస్తున్నామని నమ్మించి మోసాలకు పాల్పడటమే కాకుండా, ఆర్థిక మోసాలకు పాల్పడిన నేరస్తులకు సంబంధించిన రూపాయలను డాలర్ ల రూపంలో మార్చినట్టు కూడా గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని హష్మీ కాలనీకి చెందిన మోయిజ్ ఖాన్(Moiz Khan), సయ్యద్ హైమద్ హసన్(Syed Haimad Hassan) ను అరెస్ట్ చేసినట్లు మిగిలిన వారు పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కోన్నారు. నిజామాబాద్ కేంద్రంగా ఇతర రాష్ట్రాల్లో విస్తరించిన నెట్ వర్క్ ను చేదించిన నిజామాబాద్(Nizamabad) సిసిఎస్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినంధించారు.
ఈ సమావేశంలో సీసీఎస్ సీఐ సురేష్(CI Suresh), సీఐ రవిందర్(CI Ravindar) లతో పాటు సిబ్బంది ఉన్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్(Multi-level marketing,), క్రిప్టో కరెన్సీ, షెల్ కంపెనీలలో పెట్టుబడుల పేరిట మోసపోయిన బాధితులు నేరుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని సిసిఎస్ ఎసీపీ నాగేంద్ర చారి తెలిపారు.