Women Gestures: చాలా మంది మాటలతో చెప్పలేని భావాల్ని కంటి చూపుతో చెప్పేస్తుంటారు. అలాంటి వాళ్ళు బయట వాళ్ళతో తక్కువగా మాట్లాడతారు. దీని వలన కొంత మేరకు లాభాలున్నప్పటికీ కోల్పోయేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్ధమవుతుంది. అలా కాకుండా మాటలను లోలోపలే చంపేసుకుంటే.. కొన్ని రోజులకు ఎవరికీ ఏం చెప్పకోలేకుండా అయిపోతుంది. వారి కంటే ఎక్కువగా తమ శరీర భాషే భావాలను వ్యక్తపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలలో కొన్ని సహజమైన, సున్నితమైన సైగలు అబ్బాయిల మనసును దోచేస్తాయి. అలాంటి ఆకర్షణీయ భావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఈ మాటలు ఎలా ఉంటాయంటే.. ఎవరి హృదయాన్నైనా క్షణంలో కరిగించేలా ఉంటాయి.
చిలిపిగా పెదవి కొరుకుడు
అమ్మాయి ఆలోచనలో మునిగినప్పుడు లేదా సిగ్గుతో కొద్దిగా పెదవిని కొరికినప్పుడు, ఆ సైగలో కొంటెతనం, అమాయకత్వం కలగలిసి ఉంటాయి. ఈ చిన్న పని అబ్బాయిల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది.
Also Read: H1B Exemption: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!
జుట్టుతో మాయాజాలం
అమ్మాయిలకు జుట్టు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
చెవి వెనక్కి జుట్టు నెట్టడం: ఈ చర్య సహజ సౌందర్యాన్ని వెల్లడిస్తూ, అబ్బాయిల మనసును కదిలిస్తుంది.
పోనీటెయిల్ : కట్టివేసిన జుట్టును ఒక్కసారిగా వదిలేసి.. భుజాలపై పడేలా వదిలినప్పుడు అది సినిమా సీన్‌లా అనిపిస్తుంది. ఈ అందమైన పనికి ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే.
జుట్టు సవరించుకోవడం: ముఖంపై పడిన జుట్టును సున్నితంగా పక్కకు సరి చేసుకునేటప్పుడు, అమ్మాయి ఆత్మవిశ్వాసం, శైలి ప్రకాశిస్తాయి. ఈ సైగ అబ్బాయిలను తేలిగ్గా ఆకట్టుకుంటుంది.
మనస్ఫూర్తి నవ్వు
అమాయకమైన, మనస్ఫూర్తి నవ్వుకు సాటిలేని ఆకర్షణ ఉంటుంది. అమ్మాయి బిగ్గరగా, నిజాయతీగా నవ్వినప్పుడు, ఆ నవ్వు ఆమెలోని ఆనందం, సానుకూలతను ప్రతిబింబిస్తుంది. ఈ నవ్వు అబ్బాయిలను అల్లరిపెట్టడమే కాక, వారిని మరింత సన్నిహితంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.