Battula Prabhakar Escape (imagecredit:twitter)
క్రైమ్

Battula Prabhakar Escape: పోలీసులకు మస్కా కొట్టి బత్తుల ప్రభాకర్ పరార్.. పోలీసుల నిర్లిప్తతా? వేరే ఇంకేమైనా..?

Battula Prabhakar Escape: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్(Bathula Prabhakar) ఆంధ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అతి కష్టం మీద అరెస్ట్ చేసిన ప్రభాకర్ తప్పించుకుని పోవటంతో తిరిగి అతన్ని పట్టుకోవటానికి ఉన్నతాధికారులు 15కు పైగా ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. అటు ఆంధ్రా(AP)తోపాటు తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka), గోవా(Gova) తదతర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

19ఏళ్ల వయసులోనే..

చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన ప్రభాకర్ కుటుంబం అతని చిన్నతనంలోనే వెస్ట్ గోదావరి జిల్లా పాలకోడేరుకు వలస వెళ్లింది. ప్రభాకర్ 9వ తరగతిలో ఉండగా తల్లిదండ్రులు చనిపోవటంతో చదువు మానేశాడు. 2013లో 19 ఏళ్ల వయసులో మొదటిసారి ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్ట్ కాకపోవటంతో దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నాడు. చోరీ చేయటం.. డబ్బు పూర్తిగా ఖర్చయ్యే వరకు జల్సాలు చేయటం.. తిరిగి దొంగతనం చేయటం అతని స్టయిల్. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వరుసగా చోరీలు చేసిన ప్రభాకర్ ను 2020లో విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతనిపై 60 కేసులు నమోదై ఉన్నాయి. కాగా, 2‌‌022, మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన ప్రభాకర్ ఆ తరువాత మూడేళ్ల వరకు పోలీసులకు చిక్కలేదు.

గచ్చిబౌలికి మకాం..

జైలు నుంచి పారిపోయిన తరువాత హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్రభాకర్ ఇక్కడ ఓ యువకున్ని పరిచయం చేసుకుని అతనితోపాటు గచ్చిబౌలిలో అద్దెకు తీసుకున్న ఇంట్లో మకాం పెట్టాడు. పోలీసులకు దొరక కూడదన్న ఉద్దేశ్యంతో సోషల్ మీడియాను ఉపయోగించేవాడు కాదు. డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా వాడేవాడు కాదు. ఇక్కడికి వచ్చిన తరువాత కూడా దొంగతనాలు చేయటాన్ని కొనసాగించిన ప్రభాకర్ తనతోపాటు ఇంట్లో ఉంటున్న యువకుని ఖాతాలో డబ్బు జమ చేసేవాడు. అతని డెబిట్ కార్డులను ఉపయోగించే నగదును విత్ డ్రా చేసుకునే వాడు.

Also Read: Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!

ఇంజనీరింగ్ కాలేజీలు..

ఇళ్లల్లో చోరీలు చేస్తే పాత నేర చరిత్ర ఆధారంగా దొరికిపోతానని భావించిన ప్రభాకర్ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకున్నాడు. మొయినాబాద్, నార్సింగి స్టేషన్ల పరిధుల్లో మూడు కాలేజీల్లో దొంగతనాలు చేసి భారీ మొత్తంలో నగదు కొట్టేశాడు. ఈ కాలేజీల్లో క్లూస్ టీం సేకరించిన వేలిముద్రల ఆధారంగా చోరీలు చేసింది ప్రభాకర్ అని గుర్తించిన పోలీసులు అతని కోసం వేటను ప్రారంభించారు.

కాల్పులు

2025, ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ప్రిజం క్లబ్బు వద్ద ప్రభాకర్ ఉన్నట్టు సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రదీప్ రెడ్డి, వీరాస్వామితో కలిసి పట్టుకోవటానికి అక్కడికి వెళ్లాడు. పోలీసులను గమనించిన ప్రభాకర్ వారిపై కాల్పులు జరిపి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. కాల్పుల్లో కాలుకు బుల్లెట్ గాయమైనా హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పట్టు వదలకుండా ప్రభాకర్ ను పట్టుకున్నాడు. కానిస్టేబుళ్లు ప్రదీప్ రెడ్డి, వీరాస్వామితోపాటు ప్రిజం పబ్బు బౌన్సర్ల సహకారంతో ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఉదంతం తీవ్ర సంచలనం సృష్​ఠించింది.

ఖైదీని చంపేందుకే..

విచారణలో విశాఖ జైల్లో ఉన్నపుడు తనను తీవ్రంగా వేధించిన ఖైదీని హత్య చేసేందుకు బీహార్ వెళ్లి మూడు తుపాకులు, 500 బుల్లెట్లను ప్రభాకర్ కొన్నట్టుగా వెల్లడైంది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత శివార్లలోని నిర్మానుష్య ప్రదేశంలో కాల్పులు ఎలా జరపాలన్న దానిపై ప్రాక్టీస్ కూడా చేసినట్టు తేలింది. ఈ క్రమంలో పోలీసులు అతని నుంచి మూడు తుపాకులతోపాటు 451 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Pruthivi Raj – Dulquer: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. మలయాళం స్టార్స్ ఇళ్లల్లో మెరుపు దాడులు

3కోట్లు టార్గెట్..

3 కోట్ల రూపాయలు సంపాదించాలనుకుని టార్గెట్ గా పెట్టుకునే ప్రభాకర్ దొంగతనాలు చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా సంపాదించిన డబ్బుతో గోవాలో విలాసవంతమైన ఇల్లు తీసుకుని అక్కడే స్థిరపడాలన్నది ప్రభాకర్ పథకమని తేలింది. ఇక, ప్రభాకర్ కు వంద మందికి పైగా గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టుగా వెల్లడైంది.

పీటీ వారెంట్​ పై..

ఓ కేసులో విచారణ నిమిత్తం ఆంధ్రా పోలీసులు ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ పై ప్రభాకర్ ను ఆ రాష్ట్రానికి తీసుకెళ్లారు. రాజమండ్రి జైలుకు రిమాండ్ చేశారు. కాగా, సోమవారం ప్రభాకర్ తోపాటు గంజాయి కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని విజయవాడ కోర్టులో హాజరుపరచటానికి ఎస్కార్టు పోలీసులు తీసుకెళ్లారు. ఎస్కార్టులో ఓ ఎస్​ఐ,న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. కోర్టులో హాజరు పరిచిన తరువాత తిరిగి అంతా కలిసి రాజమండ్రి జైలుకు బయల్దేరారు. ఆ సమయంలో గంజాయి కేసు నిందితులు ఇద్దరికి కలిపి సంకెళ్లు వేసిన ఎస్కార్టు పోలీసులు ప్రభాకర్ రెండు చేతులకు కలిపి సంకెళ్లు వేశారు. దారిలో దుద్దుకూరులోని రోడ్డు పక్కన ఓ హోటల్ వద్ద వాహనాన్ని ఆపినపుడు మూత్రం వస్తుందని చెప్పటంతో ఎస్కార్టు పోలీసులు అతని కుడిచేతికి ఉన్న సంకెళ్లను తొలగించారు. ఆ వెంటనే అవకాశం చూసుకుని ప్రభాకర్ పొలాల్లోకి దూకి పారిపోయాడు. పది నిమిషాల్లో జైలుకు చేరుకుంటామనగా ప్రభాకర్ పారిపోవటం గమనార్హం.

అనేక అనుమానాలు..

ప్రభాకర్ పారిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్కార్టు పోలీసులు అతని నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని పారిపోవటంలో ప్రభాకర్ కు సహకరించారా? అన్న సందేహాలు ముందుకొస్తున్నాయి. కానపుడు పది నిమిషాల్లో జైలుకు చేరుకుంటామనగా హోటల్ వద్ద వాహనాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? ప్రభాకర్ చేతికి ఉన్న సంకెళ్లలో ఒకదాన్ని ఎందుకు అన్ లాక్ చేశారు? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ప్రభాకర్ పరార్ కావటంపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

15బృందాలతో గాలింపు..

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ప్రభాకర్ తప్పించుకుని పారిపోవటంతో పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే అతన్ని పట్టుకోవటానికి 15 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. 10మంది సీఐలు, 15మంది ఎస్​ఐలు, 40మందికి పైగా కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు అటు ఆంధ్రాతోపాటు తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి గాలింపు జరుపుతున్నట్టు సమాచారం.

Also Read: Swetcha Effect: ఆర్థిక భారం అలసత్వం స్వేచ్ఛ కథనంతో.. హెచ్ సిటీ పనులకు రంగంలో దిగిన కమిషనర్

Just In

01

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన

OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!