Fake Passbook: రిజిస్ట్రేషన్ కానీ వ్యవసాయ భూములకు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు (Fake Passbook) తయారుచేసి ఇచ్చే ఐదుగురు ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీదారుల వివరాలను కూసుమంచి ఎస్సై నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు పట్టాదారు పాసు బుక్కులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ పట్టాదారు పాసు బుక్కులు తయారుచేసి ఇచ్చారని కళ్లెం అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున గంగబండ తండా ఫ్లై ఓవర్ దగ్గర నకిలీ పాసు పుస్తకాలను తయారీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిందితుల నుండి రెండు కార్లు, 10 నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: Katrina Kaif: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు
నిందితుల వివరాలు
కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కొత్త జీవన్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రం సాయి నగర్ కు చెందిన కొండూరి కార్తీక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన పారిపత్తి సాయి కుషాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి ఇందిరానగర్ కాలనీకి చెందిన జక్కపల్లి వరప్రసాద్, ఖమ్మం జిల్లా కేంద్రం బొక్కలగడ్డ సమీపంలోని మంచి కంటి నగర్, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఏకే ప్రింటింగ్ ప్రెస్ సమీపంలోని మసీదు ఏరియాకు చెందిన నందమూరి లక్ష్మణ్ రావు లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి టీఎస్ 28 కే 8811 మహీంద్రా థార్ కారు, టీజీ 28 3779 ఎర్టిగా కారు, తయారుచేసిన 10 దొంగ పట్టాదారు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: OG distribution issues: ‘ఓజీ’ సినిమాపై ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ల ఆవేదన!.. ఎందుకంటే?