Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో తల్లి కాబోతోందన్న సంతోషకరమైన వార్త అభిమానులతో పంచుకుంది. 2021లో నటుడు విక్కీ కౌశల్‌తో ప్రేమ వివాహం చేసుకున్న కత్రినా, పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా ఆమె గర్భవతి అనే ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.
Also Read: Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ
అయితే, ఇటీవల ఓ ఈవెంట్‌లో కత్రినా బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. చివరకు కత్రినా , విక్కీ కౌశల్ ఈ ఊహాగానాలను నిజం చేశారు. తను తల్లి కాబోతోందనే విషయాన్ని అధికారికంగా ప్రకటన చేశారు. విక్కీ, కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, “మా జీవితంలో కొత్త, అద్భుతమైన అధ్యాయం మొదలవబోతోంది” అని సంతోషంగా తెలిపారు.
Also Read: CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పణ
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జోడికి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. కత్రినా-విక్కీ జంటకు ఈ సంతోషకరమైన సమయంలో అందరూ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు.