SGT Post Fraud: DSC 2024 SGT పోస్ట్ (SGT Post Scam)ఎంపికలో అవకతవకలు ఏర్పడ్డాయి. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రెండు క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసి అధికారులను ఓ నిరుద్యోగి మోసగించాడు. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొర్నేవెల్లి గ్రామానికి చెందిన గౌరవరపు జొనాదన్ అలియాస్ యలమంద వివాహం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం మండలం బస్సుమూడి గ్రామానికి చెందిన వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. తల్లాడ కుర్నేవెల్లి గ్రామానికి చెందిన ఎలమంద ఇక్కడే ఆధార్ కార్డు తీసుకున్నాడు. మ్యారేజ్ అనంతరం ఆధార్ కార్డు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ భీమవరం మండలం బలసుముడి గ్రామ అడ్రస్ తో ఆధార్ కార్డు మార్పించుకున్నాడు.
Also Read: OG release issue: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!.. ఎందుకంటే?
2024 DSC లో స్థానాలు పోస్టులకు ఖమ్మం జిల్లాలో నోటిఫికేషన్
ఎలమంద బీఇడి చేసి ఆ తర్వాత ఎంఈడి కూడా చేశాడు. బీఈడీ, ఎంఈడి పూర్తి చేసిన ఉద్యోగాలు రాకపోవడంతో మరల టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (టిటిసి) పొందాడు. ఈ క్రమంలో 2024 DSC లో స్థానాలు పోస్టులకు ఖమ్మం జిల్లాలో నోటిఫికేషన్ వెలువడింది. దీంతో తన వద్ద ఉన్న టిటిసి సర్టిఫికెట్స్ తో నోటిఫికేషన్ లోని నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తుల వెరిఫికేషన్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అక్టోబర్ 5 2024న సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. ఇందుకు ఎలమంద వద్ద కాస్ట్ సర్టిఫికెట్ అందుబాటులో లేకపోవడంతో సమర్పించలేదు. సర్టిఫికెట్ పెండింగ్ ఉన్నట్టుగా గ్రీన్ పెన్ తో అధికారులు మార్కింగ్ చేసుకున్నారు.
డీఎస్సీ ఎస్జీటీ పోస్టుకు ఎంపికైనట్లుగా అధికారులు ప్రకటించారు
ఏం జరిగిందో ఏమో మొత్తానికి అక్టోబర్ 9 2024 లో జోనాథన్ అలియాస్ ఎలమంద డీఎస్సీ ఎస్జీటీ పోస్టుకు ఎంపికైనట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో అయోమయానికి గురైన తోటి డీఎస్సీ అభ్యర్థులు మార్చి నెలలో ఆర్టిఐ కింద అనర్హత ఉన్న జనాధన్ ఎస్ జి టి పోస్ట్ పొందాడని దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఏడో నెల నడుస్తుండగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు ఆర్టిఐ కింద అప్లై చేసిన దరఖాస్తుకు సెప్టెంబర్ 22న పూర్తి సమాచారం అందించారు.
అక్రమ పద్ధతిలో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నాలు
దీంతో జొనాధన్ గుట్టు రట్టయింది. అయితే అక్రమ పద్ధతిలో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నాలు చేసిన జొనాదన్ ఉద్యోగానికి అనర్హుడు అని తేలడంతో ఆయనకంటే తక్కువ మార్కుల శాతం వచ్చినవారు ఉద్యోగానికి అర్హులుగా ఎంపిక చేయబడతారు. డీఎస్సీ ఎస్జీటీ పోస్ట్ కు సంబంధించి కొన్ని నిబంధనలు స్టేషన్లో పేర్కొన్నారు. ఎస్ జి టి పోస్ట్ పొందాలంటే టిటిసి లో ఉత్తీర్ణులై ఉండాలి. వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. బీఈడీ, ఎం ఈ డి పూర్తి చేసి మళ్లీ తక్కువ ఉన్న టిటిసి లో ఉత్తీర్ణత సాధించి అదే సర్టిఫికెట్తో ఉద్యోగం పొందడానికి అర్హులు కాదు. జొనాదన్ ఈ లాజిక్ తెలుసుకోలేక పోయిండా…? లేదంటే అధికారులే కావాలని జొనాదన్ ఉద్యోగాన్ని కట్టబెట్టారా..? అనేది జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Als Read: Batukamma Festival: పువ్వులను పూజించే సంప్రదాయం.. వైద్యశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు