Batukamma Festival: సంస్కృతి,సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పూలను పూజించి దేవతలుగా చూసుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ (Batukamma Festival)అని కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ఎన్.చందన,డాక్టర్ జి.శిరీష పేర్కొన్నారు.బతుకమ్మ వేడుకలలో మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలును మంగళవారం కామేపల్లి వైద్యశాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా,కన్నుల పండుగగా బతుకమ్మ వేడుకలను ఆటా పాటలతో నిర్వహించారు.
Also Read: Bommala koluvu: దసరా పండుగ ప్రత్యేకం.. పల్లెల్లో బొమ్మల కొలువు సాంప్రదాయాలకు నెలవు
సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ
తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మలు అలంకరణ, పాటలు,నృత్యాలతో వేడుకలును ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎన్.చందన,డాక్టర్ జి.శిరీష మాట్లాడుతూ..మన పండుగ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచకని తెలిపారు.తొమ్మిది రోజులు పాటు ఆడ బిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలును పేర్చి ఆడుకునే గొప్ప పండుగ అని అన్నారు.ఎక్కడైనా “దేవతలను” పూలతో పూజిస్తారు కానీ పూలనే “దేవతలుగా” పూజించే సాంప్రదాయానికి నిదర్శనం బతుకమ్మ పండుగ అన్నారు.ఈ పండుగను ప్రజలందరూ
సుఖ,సంతోషాలతో
జరుపుకోవాలని,కామేపల్లి మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలలో పల్లె దవాఖాన డాక్టర్ సౌజన్య,డాక్టర్ జి.తనూష,డాక్టర్ పూజ,ఎం ఎల్ హెచ్ పిలు నాగమణి,సుకన్య, శివాని,వైద్య సిబ్బంది హెచ్ వి యం.లక్ష్మి,స్టాఫ్ నర్స్ పుష్పలత, యస్.రమాదేవి,తులసి,అరుణ,కె. రేణుక రాణి,వెంకటరమణ, రమణమ్మ,ముంతాజ్,దేవమ్మ,హేమలత,మీనా,అంజమ్మ,సునిత,ఉషారాణి,నవత,నాగమణి,గీతా బాయ్,రాధిక,ఎల్ చిన్ని, వసుంధర,ఆశా కార్యకర్తలు, హెచ్ఇ ఓ కె.వెంకటేశ్వర్లు,హెల్త్ సూపర్వైజర్లు రాధాకృష్ణ,బి. నరేంద్రనాయక్,జాబ్శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Shreyas Iyer: అయ్యర్‌కు ఏమైంది?.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ టీమ్ నుంచి వైదొలగిన వైనం