Lord Hanuman: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాల పేరుతో భారత్ ను ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హెచ్-1బీ వీసాపై ఆంక్షలు విధించడం ద్వారా భారత్ పై మరో బాంబ్ పేల్చాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు హిందూ దేవుళ్లను సైతం అమెరికా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ నేత.. హనుమంతుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
అసలేం జరిగిందంటే?
టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ పట్టణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం (Shri Ashtalakshmi Temple)లో ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ (Statue of Union) పేరుతో గతేడాది 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిపై టెక్సాస్ రిపబ్లికన్ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ (Alexander Duncan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డంకన్ తన ఎక్స్ (Twitter) ఖాతాలో గ్రహం వీడియోను పోస్ట్ చేస్తూ తన అక్కసు వెళ్లగక్కాడు. ‘మనం టెక్సాస్‌లో తప్పుడు హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నాం? అమెరికా ఒక క్రైస్తవ దేశం’ అని రాసుకొచ్చారు.
బైబుల్ సూక్తులు జోడించి..
అంతేకాకుండా మరో పోస్టులో బైబిల్ వచనాలను సైతం డంకన్ జత చేశారు. ‘నేను తప్ప మీరు వేరే దేవతలను పూజించకూడదు. భూమి, ఆకాశం, సముద్రంలో ఎక్కడైన ఏదోక రూపం కలిగిన ప్రతిమను మీరు మీ కోసం తయారు చేసుకోరాదు’ (ఎగ్జోడస్ 20:3-4) అని ఉన్న వాక్యాన్ని జోడించారు.
చర్య తీసుకుంటారా?
ఆయనపై చర్య తీసుకుంటుందా?’ఆంజనేయుడిపై డంకన్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఈ వ్యాఖ్యలను ఖండించింది. ‘హిందువుల పట్ల ద్వేషపూరితమైనవి. రెచ్చగొట్టే స్వభావం కలిగినవి’గా అభివర్ణించింది. అంతేకాదు డంకన్ చేసిన పోస్టును టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకీ ట్యాగ్ చేసింది. ‘హలో @TexasGOP, మీ పార్టీ సెనెట్ అభ్యర్థి మీ వివక్షా వ్యతిరేక మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ హిందువుల పట్ల ద్వేషపూరితమైన ప్రవర్తన ప్రదర్శించాడు. అంతేకాకుండా అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్లోని మత స్వేచ్ఛను గౌరవించని ధోరణి ఇది. మీ పార్టీ ఆయనపై చర్య తీసుకుంటుందా?’ అని ప్రశ్నించింది.
Hello @TexasGOP, will you be disciplining your senate candidate from your party who openly contravenes your own guidelines against discrimination—displaying some pretty sordid anti-Hindu hate—not to mention disrespect for the 1st Amendment’s Establishment Clause? https://t.co/5LItlu7Zu2 pic.twitter.com/oqZkZozUBR
— Hindu American Foundation (@HinduAmerican) September 22, 2025
నెటిజన్ల రియాక్షన్..
హిందూ అమెరికన్ ఫౌండేషన్ తో పాటు పలువురు నెటిజన్లు సైతం అలెగ్జాండర్ డంకన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘ఎవరి విశ్వాసాలు వారివి.. ఇలా అగౌరవపరచడం సరైనది కాదు’ అంటూ ఒక నెటిజన్ పేర్కొన్నాడు. హిందువుల పట్ల అమెరికా వైఖరి.. ఈ ఘటనతో బయటపడిందని మరొకరు రాసుకొచ్చారు. ‘వేదాలు ఏసు క్రీస్తు జననం కంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి. అవి అద్భుతమైన గ్రంథాలు. క్రైస్తవ మతంపై కూడా వాటి ప్రభావం ఉంది. కాబట్టి మీకంటే ముందే ఉద్భవించిన మతాన్ని గౌరవించడం, తెలుసుకోవడం మంచిది’ అని ఇంకో యూజర్ చెప్పుకొచ్చారు.
Also Read: Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!
విగ్రహం గురించి..
2024లో టెక్సాస్ లో ఏర్పాటు చేసిన ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’.. అమెరికాలోని అతి పెద్ద హిందూ విగ్రహాలలో ఒకటి. ఇది శ్రీ చినజీయర్ స్వామి ఆవిష్కరించిన ఆధ్యాత్మిక దృక్పథంలో భాగంగా నిర్మించబడింది. ఈ విగ్రహం అమెరికాలో మూడవ అతి పెద్ద విగ్రహంగా నిలిచింది.