Karnataka-Case
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Bengaluru: భార్యపై అనుమానం.. కూతురు చూస్తుండగానే బస్టాప్‌లో చెప్పలేని దారుణానికి ఒడిగట్టిన భర్త

Bengaluru: వైవాహిక బంధంలో అనుమానాలు దారుణ నేరాలకు దారితీస్తున్నాయి. కిరాతక హత్యలకు కారణమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో (Bengaluru) తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 32ఏళ్ల వయసున్న మహిళను ఆమె భర్త దారుణంగా కడతేర్చాడు. అది కూడా జనసందోహం ఉండే బస్‌స్టాప్‌లో , ఆమె 12ఏళ్ల కూతురు చూస్తుండగా కత్తితో ఘోరంగా పొడిచిపొడిచి చంపాడు. చనిపోయిన మహిళ పేరు రేఖ అని, నిందిత భర్త పేరు లోహితాష్వ అని పోలీసులు తెలిపారు.

పెళ్లి కాకముందు నుంచే కలిసి జీవిస్తున్న వీరిద్దరూ.. మూడు నెలల క్రితమే ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారని వివరించారు. ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి అని పోలీసులు వివరించారు. మొదటి భర్తతో విడిపోవడానికి ముందే రేఖకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత కూడా పిల్లలను ఆమే పెంచుకుంటోంది. ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో పెద్ద కూతుర్ని తన వద్దే ఉంచుకుంటోంది. ఇక, చిన్నకూతుర్ని తన తల్లిదండ్రుల వద్ద ఉంచింది. మరోవైపు, నిందితుడు లోహితాష్వ కూడా మొదటి భార్య నుంచి విడిపోయాడు. విడాకులు కూడా తీసుకున్నాడు.

Read Also- Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ

రేఖ, లోహితాష్వ ఇద్దరి మధ్య చనువు ఏర్పడి, అంగీకారం ప్రకారం పెళ్లి కాకుండానే గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. సిరా అనే పట్టణం నుంచి బెంగళూరుకు మకాం మారారు. భర్త లోహితాష్వకు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించి విషయంలో రేఖ సాయం చేసింది. తాను పనిచేస్తున్న కాల్ సెంటర్‌లోనే అతడికి జాబ్ ఇప్పించింది. అయితే, నిందితుడు క్రమంగా రేఖపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని, అతడితో మాట్లాడుతోందని ఆరోపిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం, రేఖ తన పెద్ద కూతురితో కలిసి బస్‌స్టాప్‌లో వేచివుండగా, లోహితాష్వ అక్కడికి వెళ్లాడు. ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాదాపు పన్నెండు సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత మహిళను అక్కడే ఉన్న కొందరు ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. గాయాలు తీవ్రమైనవి కావడంతో చికిత్స పొందుతూ రేఖ చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. హత్యకు పాల్పడ్డ లోహితాష్వను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కమాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదయిందని, ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

Read Also- Warangal District: నేను చేసే ప్రతి పని ప్రజల కోసమే నా లాభం కోసం కాదు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

నేరాలకు దారితీస్తున్న అనుమానాలు

భాగస్వాములపై అనుమానాలు దారుణ నేరాలకు దారితీస్తున్నాయి. అనుమానాలు పరస్పర నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో దారుణ పరిణామాలకు కారణమవుతున్నాయి. చిన్నచిన్న గొడవలను పెద్ద సమస్యలుగా మార్చేస్తున్నాయి. నమ్మకం కోల్పోయిన తర్వాత ప్రేమ, ఆప్యాయతలు తగ్గి ఘర్షణలే ఎక్కువగా జరుగుతున్నాయి. మనస్పర్థలు హింసకు దారితీయడం, కుటుంబాలు చిన్నాభిన్నం కావడం, చిన్నపిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపడం వంటి దుష్ప్రపరిణామాలు అనివార్యమవుతున్నాయి.

 

Just In

01

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..

Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు ఫైర్

Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం

Swetcha Effect: ఆర్థిక భారం అలసత్వం స్వేచ్ఛ కథనంతో.. హెచ్ సిటీ పనులకు రంగంలో దిగిన కమిషనర్

Haris Rauf controversy: భారత ఫైటర్ జట్లు కూల్చినట్టుగా బౌలర్ రౌఫ్ ఇచ్చిన సంకేతంపై పాక్ రక్షణ మంత్రి స్పందన